
మైక్రో ఇరిగేషన్ వ్యవసాయ పరికరాలు పై రాయితీలు కొనసాగించాలని సీపీఐ రైతుసంఘం ఆధ్వర్యంలో ఎం.ఆర్.ఓ కార్యాలయంలో ఖాళీ కుర్చీకి వినతి
దేవరకొండ ( పల్లె వెలుగు ) 21 అక్టోబర్: వ్యవసాయ పరికరాలు పై గతప్రభుత్వాలు రాయితీ లు కల్పించడం వల్ల రైతు వ్యవసాయానికి అవసరమైన పరికరాలు సమకూర్చుకునే వాడని ప్రస్తుత ప్రభుత్వం రాయితీలను ఉపసంహరణ చేసుకోవడం వలన వ్యవసాయ ఉపకరణాలు ను కొనుగోలు చేసే శక్తి లేక నష్టపోతున్నడని అందువల్ల రైతు కు రాయితీలు కొనసాగించాలని సీపీఐ, ఆంద్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో ఎం.ఆర్.ఓ కార్యాలయంలో అధికారులు ఎవ్వరు లేకపోవడంతో ఖాళీ కుర్చీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఎం.జగదీష్ మాట్లాడుతూ ప్రయివేట్ కంపెనీలు కు,వ్యాపారులు కు రాయితీలను అందించే ప్రభుత్వం రైతుకు ఆసరాగా ఉండే వ్యవసాయ పరికరాలు పై ఎందుకు రాయితీలు ను కొనసాగించలేదని ప్రశ్నించారు. విదేశీ కంపెనీలు పెట్టుబడులు ను ఆకర్షించేందుకు ఇతర ప్రయివేటు సంస్థలు కు వేల కోట్లు రాయితీలు క్రింద ప్రకటిస్తూ వారు ఎటువంటి నష్టాల్లో లేకున్నా వారిని ఆకర్షించేందుకుప్రజాధనం ను వృధా చేసే ప్రభుత్వం పంట పండించి అన్నం పెట్టే రైతుకు మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా అసలే ఒకవైపు ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టాన్ని ఎదుర్కొంటున్న మరో వైపు నకిలీ విత్తనాలు,ఎరువుల తో పాటు పెరుగుతున్న ధరల తో మరింత ప్రమాదం లో పడిన రైతుకు అవసరమైన పరికరాలు కొనుగోలుకు ఇచ్చే రాయితీలు తొలగిస్తే మరింత నష్టం జరుగుతుందని ప్రభుత్వం ఆలోచించి రాయతీలు కొనసాగించాలని కోరారు. రైతుసంఘం మండల కార్యదర్శి శివశంకర్, వి.విరేశ్, వి.రాజు, ఎం.రాజు, నరేంద్ర లు పాల్గొన్నారు