Devanakonda

నకిలీ పత్తివిత్తనాలు రైతులకు అమ్మిన డీలర్ల పై చర్యలు తీసుకోవాలి

  • వ్యవసాయ అధికారులు పత్తిపొలాలు పరిశీలించి చర్యలు చేపట్టాలి.
  • ఆంద్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్ డిమాండ్

దేవనకొండ (పల్లె వెలుగు) 12 అక్టోబర్:  మండలంలో నకిలీ విత్తనాలను సాగుచేయడం ద్వారా రైతులకు ఎకరానికి ఒక క్వింటాల్ పత్తి కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని, వ్యవసాయ శాఖ అధికారులు దిగుబడి రాని పంట పొలాలు పరిశీలించి రైతులకు నకిలీ విత్తనాలు అమ్మిన కంపెనీలు పై చర్యలు తీసుకోవాలని ఆంద్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్ లు అధికారులు ను కోరారు. సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన రైతుసంఘం ముఖ్యలు సమావేశంలో  వారుమాట్లాడుతూ ఈ సంవత్సరం  కంపెనీ విత్తనాలు పేరుతో జాదు, 369, జాదు, లైన్ కంపెనీల పేరుతోనకిలీ లేబుళ్ల తో  విత్తనాలను సీడ్ సరిగ్గా చేయకుండా రైతులకు అమ్మడం జరిగింది అని, దీనివల్ల మొక్క రెండు నెలలు పూర్తికాక ముందే ఎర్రతెగులు వచ్చి పూర్తిగా పంట నాశనం అయ్యింది అని వారు అన్నారు. ఎకరానికి ఒక క్వింటాలు పత్తి కూడా దిగుబడి రావడం లేదని  వారు అన్నారు. తక్షణమే వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ విత్తనాలు తో సాగుచేసి నష్టపోయిన రైతులు పంటపొలాలు పరిశీలించి నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై తగుచర్యలు తీసుకుని రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెనుమాడ వెంకటేశ్వర్లు, రవి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button