Devanakonda

ఈ-శ్రమ్” కార్డు పొందండి-కుటుంబానికి భరోసా కల్పించండి

  • “ఈ-శ్రమ్” కార్డును సద్వినియోగం చేసుకోండి..
  • “ఆలూరు కార్మిక శాఖ అధికారి వెంకట్రాముడు” కార్మికులకు పిలుపు..

దేవనకొండ (పల్లె వెలుగు) 06 అక్టోబర్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన “ఈ – శ్రమ్” కార్డును పొంది కుటుంబాలకు భరోసా కల్పించాలని “ఆలూరు కార్మిక శాఖ అధికారి జె. వెంకట రాముడు యాదవ్” కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం మండల కేంద్రమైన దేవనకొండ నందు స్థానిక అయ్యప్పస్వామి దేవాలయంలో భవన నిర్మాణ రంగ కార్మికులు మరియు సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమావేశం మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎమ్.నరసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో కార్మిక శాఖ అధికారి మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం  సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు నూతనంగా “ఈ-శ్రమ్ పథకాన్ని” పెట్టడం జరిగిందన్నారు. ఈ పథకంలో చేరడం వల్ల ప్రయోజనాలు ప్రతి అసంఘటిత కార్మికులకు 12 అంకెలు గల ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్డు ఉంటేనే ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రత, వివిధ సంక్షేమ పథకాలు వర్తింప చేయడం జరుగుతుందన్నారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి రెండు లక్షల ప్రమాద మరణ/అంగవైకల్య భీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందన్నారు. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులను ఉద్దేశించి చేసే పథకాలు మరియు విధానాలకు “ఈ- డేటాబేస్” నే ప్రామాణికంగా తీసుకోనున్నారని తెలిపారు. వలస కార్మికుల గుర్తింపు కోసం అనంతరం వారికి ఉపాధి కల్పించాలని సంకల్పించారు. ఈ పథకంలో చేరడానికి అర్హులు ఎవరంటే 16 సంవత్సరాల వయస్సు నుండి 59 సంవత్సరాల వయస్సు లోపు ఉన్నవారు మాత్రమే అర్హులన్నారు. అలాగే ఆదాయపు పన్ను చెల్లించని వారు ఈపీఎఫ్, ఈఎస్ఐ లేనివారు అర్హులన్నారు. ఇంకా వ్యవసాయ, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, వ్యవసాయదారులు, రాళ్లుకొట్టే పని, సెంట్రింగ్, తాపీమేస్త్రి, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, శానిటరీ, పెయింటర్స్, టైల్స్, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఇటుక, బట్టీలు, సున్నంబట్టి లు, కాంక్రీట్ మిక్సర్, బావులు తవ్వడం మరియు పూడిక తీయడం, టైలరింగు, ఎంబ్రాయిడరీ, డ్రెస్ మేకర్స్, డ్రైవర్లు, హెల్పర్లు, చేనేత పని వారు, కమ్మరి, స్వర్ణకారులు, కుమ్మరి పనివారు, బార్బర్ వృత్తి వారు, బ్యూటీ పార్లర్ లో పని చేయువారు, చర్మకారులు, రజకులు, అలాగే స్వయం ఉపాధి అయిన వీధి వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారస్తులు, ఇంటి వద్ద వస్తువులు తయారీ, చిరు వ్యాపారులు, కల్లుగీత కార్మికులు, కళాకారులు, రిక్షా కార్మికులు, బీడీ కార్మికులు, అలాగే ఇళ్లల్లో పనిచేసే వారు, కొరియర్ బాయ్స్, నర్సులు, కమీషన్ ఏజెంట్లు, ఎన్ఆర్ఈజీఎస్ వర్కర్లు, ఆశ వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లు, మహిళా స్వయం సహాయక సంఘాల వారు, విద్యా వాలంటీర్లు, గ్రామ మరియు వార్డు వాలంటీర్లు అలాగే హమాలీలు, దుకాణాలలో పని చేసే పని వారు మొదలైన వారికి పథకం వర్తిస్తుంది అన్నారు. ఈ పథకం నందు నమోదు చేసుకొనుటకు ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఆధార్ కు అనుసంధానమైన మొబైల్ ఫోన్ ఉండవలెనన్నారు. ఈ పథకంలో చేరేందుకు సమీపంలోని సిఎస్సి సెంటర్, మీ సేవలో, సచివాలయాలు నందు సంప్రదించ వలసినదిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇతర సంక్షేమ పథకాల కార్మికులు ఎమ్.వెంకటేశ్వర్లు, రహంతుల్లా, గోవిందు, వీరస్వామి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, వెంకటేష్, నజీర్, కాశీం, నర్సోజి, కృష్ణ, రంగన్న, కుమార్, అంజి, రామాంజనేయులు, షేక్షావలి, మోదిన్, మాదన్న, రంగస్వామి, సల్మాన్, రహిమాన్, షేక్షా , తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button