Devanakonda

దేవనకొండ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి.

  • రైతుకు ఎకరాకు 30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని తాసిల్దార్ కార్యాలయం ముందు
  • అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా….

దేవనకొండ (పల్లె వెలుగు) 05 అక్టోబర్ : మండల వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో రైతులు వేసిన ప్రధాన పంటలు వేరుశనగ, పత్తి, కంది, ఆముదం, మినుములు వర్షం లేని కారణంగా ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయి ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే మండలం ను కరువు ప్రాంతంగాప్రకటించి నష్ట పోయిన రైతులకు ఎకరాకు 30  వేలు పంట నష్ట పరిహారం చెల్లించాలని అఖిల పక్ష పార్టిలు డిమాండ్ చేసాయి. సోమవారం అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో తాసీల్దార్ కార్యాలయం ముందు రైతుల తో కలసి ధర్నా నిర్వహించారు.అంతకు ముందు స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా సిపిఐ నాయకులు వెంకటేశ్వర్లు, సూరి సంజాన్నా అధ్యక్షతన జరిగిన ధర్నాలో సిపిఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్, సిపిఐ మండల ప్రదాన కార్య దర్శి యం.నరసరావు లోక్సత్తా నాయకులు రామదాసు గౌడ్, బీఎస్పీ మండల నాయకులు ఈరన్న, కాంగ్రెస్ నాయకులు మిరప కాయల శ్రీనివాసులు లు మాట్లాడుతూ ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో లోటు వర్ష పాతము వల్ల పంటలు పూర్తిగా దెబ్బ తిన్నయని, పెట్టినా ఖర్చులో కూడా చిల్లి గవ్వ కూడా రాక అప్పుల్లోన కురుకు పోయారని, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇప్పటికె అఖిలపక్ష బృందం ఆధ్వర్యంలో క్షేత్ర స్తాయిలోకి వెళ్లి పంటలను పరిశీలించడం జరిగిందని అన్నారు. వేసిన పంటలు వర్షం లేనందున ఎండిపోవడం తో రైతులకు తీవ్ర ఆందోళన కలిగించే విషయం అని అన్నారు, రాష్ట్ర ప్రభుత్వo, జిల్లా కలెక్టర్ ఎండుతున్న పంటలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన రైతులను ఆదుకునేందుకు భరోసా కల్పించేందుకు ముందుకు రావాలని తెలిపారు, పంట వేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేల నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకం వర్తింపు చేయాలని, బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలన్నీ మాఫీ చేయాలని, రబీ సీజన్లో వేసే పంటలకు ప్రభుత్వమే ఎరువులు, విత్తనాలు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు, అదేవిధంగా 2018 సం సంబంధించిన పెండింగులో ఉన్న పంట నష్ట పరిహారం ఇవ్వలని  డిమాండ్ చేసారు. ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు అన్ని రాజకీయ పార్టీల ,ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దశల వారి  ఆందోళన చేపడుతామని పేర్కొన్నరు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల మండల నాయకులు సుల్తాన్, అబ్దుల్లా, బడేసాహెబ్, ప్యాలకుర్తి శివుడు, బుర్రకుంట బజారి రైతులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button