
దేవనకొండ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించాలి
- బ్యాంకు ల్లో రైతు అప్పులు రద్దు చెయ్యాలి
- సీపీఐ-రైతుసంఘం ఆద్వర్యంలో తాహశీల్దార్ గారికి వినతి
- సీపీఐ, ఆంద్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సమితి పిలుపు మేరకు
దేవనకొండ (పల్లె వెలుగు) 5 అక్టోబర్: మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి తక్షణమే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులను ఆదుకోవాలని, ఈ ఖరీఫ్ సీజన్ నందు రైతులు తీసుకున్న అప్పులు రద్దు చెయ్యాలి ఆంద్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్ లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు దేవనకొండ తాహశీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు తో కలసి తాహశీల్దార్ ఇంద్రాణి గారికి వినతిపత్రాన్ని అందజేశారు. కర్నూల్ జిల్లా లో పశ్చిమ ప్రాంతంలో ఈ సంవత్సరం వర్షాలు సరైన సమయంలో కురవక రైతులు వేసిన పత్తి,వేరుశనగ, సజ్జ,జొన్నతదితర పంటలు ఎదుగుదల లేక కాపు కాయక ఎండిపోయాయి. పంటల సాగుకు రైతు ఎకరానికి 50 వేల నుండి 1 లక్ష రూపాయల వరకు బ్యాంక్ ల్లో మరియు ప్రవేట్ వ్యక్తులు దగ్గర అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి నేడు పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక తెచ్చిన అప్పులు కు వడ్డీలు చెల్లించే పరిస్థితి కూడా లేదని అందువల్ల దేవనకొండ మండలాన్ని కరువు మండలం గా ప్రకరించి ఎకరానికి 25 వేలు నష్టపరిహారం చెల్లించాలని, వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకు ల్లో రైతులు తీసుకున్న అప్పులు రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎం.రాజు,మహేష్ నాయుడు, రైతుసంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.