Devanakonda

దేవనకొండలో విలేకరుల సమావేశం నిర్వహించిన బిజెపి

దేవనకొండ (పల్లె వెలుగు) 2 అక్టోబర్: శనివారం దేవనకొండ మండలంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశం లో మండల అధ్యక్షుడు బొడా రవి కుమార్ మాట్లాడుతూ పురుషోత్తం రెడ్డి ఆదేశాల మేరకు  సెప్టెంబర్ 25 రోజున సుప్రీంకోర్టు న్యాయవాది, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదోని డివిజన్ ఇన్చార్జి అయినటువంటి పురుషోత్తం రెడ్డి  దేవనకొండ మండలం స్థానిక పోలీస్ స్టేషన్ నందు సెప్టెంబర్ 07న జరిగినటువంటి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కొందరి అల్లరి మూకల ప్రవర్తనపై చర్యలు తీసుకోమని ఎస్ఐ కి ఇచ్చిన ఫిర్యాదును బట్టి రెండో తారీకు లోపు వారిపై చర్య తీసుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని చెప్పడం జరిగిందిని అలాగే  గొడవకు కారణమైన వారిపై  చర్యలు తీసుకోవాలని అర్జీ ఇవ్వడం జరిగింది. కావున వారిపై చర్యలో భాగంగా పత్తికొండ కోర్టు మేజిస్ట్రేట్ కి ASI కేస్ నమోదు చేయమని పంపడం జరిగింది. కావున వారిపై చర్యలు తీసుకుంటామని ASI శ్రీనివాసులు తెలియజేసారన్నారు. కావునా  si  వారిపై తొందరగా చర్యలు చేపట్టాలని కోరహా ఎస్.ఐ సానుకూలంగా స్పందించరన్నారు. దేవనకొండ మండల ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.

Back to top button