Devanakonda

రైతులను ఆదుకోవడానికి తక్షణ కరువు సహాయ క చర్యలు చేయపట్టండి

రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షుడు. పి.రామచంద్రయ్య

దేవనకొండ (పల్లె వెలుగు) 01 అక్టోబర్:  అధిక పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసినా సరైనసమయంలో వర్షాలు కురవక రైతులు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని,పత్తికి,ఉల్లి కి ఎకరానికి 50 వేలనుండి 1లక్ష వరకు పెట్టుబడి పెట్టినా  రైతుకు పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వేసిన వేరుశనగ, పత్తి పంటలు ఎండిపోయి మొక్క ఎదుగుదల లేక కాపు రాక మరింత అప్పుల్లోకి వెళ్లే పరిస్థితి ఉందని తక్షణ కరువు సహాయ చర్యలు చేపట్టి రైతును ఆదుకోవాలని ఆంద్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య,రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జగన్నాథ్ లు ప్రభుత్వాన్ని కోరారు. దేవనకొండ లో ఎండిపోయిన రైతుల పంటపొలాలు సీపీఐ-ఆంద్రప్రదేశ్ రైతుసంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించినా సరైన వర్షాలు రాక  రైతు దగ్గర అమ్ముకోవడానికి పంటలే లేవని,అందువల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతును ఆదుకోవాలని కోరారు. రైతు బాంక్ లో తీసుకున్న రుణాలను రద్దు చేసి,రైతుకు కరువు సహాయం క్రింద ఎకరానికి 25,000 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పరిశీలించి న  ఎండిపోయిన పంట లను ప్రభుత్వం, అధికారులు దృష్టికి తీసుకెళ్లి రైతును ఆదుకునే చర్యలు చేపట్టాలని కోరుతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్, జె. ఇబ్రహీం,మహేశ్ నాయుడు, పాలకుర్తివెంకటేష్, రామాంజనేయులు, గుడిమరాళ్ల తిమ్మప్ప, వి.రాజు, రంగస్వామి, నర్సయ్య లు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button