Devanakonda

దేవనకొండ మండలం కరువు గా ప్రకటించి తక్షణమే రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలి

అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల డిమాండ్

దేవనకొండ (పల్లె వెలుగు) 29 సెప్టెంబర్: మండలంలో  సీజన్ పూర్తవుతున్నా అరకొర వర్షాల వలన ఈ సంవత్సరం మండల వ్యాప్తంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వెంటనే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం నాడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం నందు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది రైతు సంఘం మండల అధ్యక్షులు సూరి సంజాన్న  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ, తెలుగు దేశం, కాంగ్రెస్, లోక్ సత్తా ,బిఎస్పి , అదేవిధంగా సిఐటియు, ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాలు,  యువజన విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం జిల్లా నాయకులు బి.వీర శేఖర్ ,సిపిఐ మండల కార్యదర్శి నరసరావు లు మాట్లాడుతూ ఈ సంవత్సరం ఖరీఫ్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని రైతులు గత సంవత్సరం లో అధిక వర్షాల వల్ల నష్టపోతే ఈ సంవత్సరం అనావృష్టి వర్షాభావ పరిస్థితుల వలన నష్టపోయారని రైతులు వేసిన టువంటి వేరుశనగ , పత్తి,కంది,జొన్న,టమోటా వంటి పంటలు తీవ్రంగా నష్టపోయాయని వెంటనే ప్రభుత్వం రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో నష్టపరిహారాన్ని అంచనావేసి రైతులకు పరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎకరాకు 30 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని గత రెండు సంవత్సరాలుగా నష్టపోతున్న రైతులు ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని ఈ మేరకు రైతులకు రుణ మాఫీ, రబీ సీజన్లో విత్తనాలు ఎరువులు,సరఫరా చేయాలని కోరారు హంద్రీ నీవా నుండి సాగు నీటి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు మండల రైతాంగం కు అండగా , కరువు మండలంగా ప్రకటన, నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ తో అఖిల పక్ష పార్టీలు, ప్రజా సంఘాల అధ్వర్యంలో దశల వారీగా ఆందోళన చేయాలని సమావేశం నిర్ణయించింది… ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం పార్టీనాయకులు మస్తాన్,లోకసత్తా నాయకులు రాందాస్ గౌడ్,బీఎస్పీ వీరన్న, రైతు సంఘం నాయకులు రాఘవరెడ్డి,బడేసన్, శ్రీరాములు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు యూసుఫ్ భాష, మహబుబ్ భాష, ఆంజనేయుల,bkmu నాయకుల వెంకటేశ్వర్లు, సీఐటీయూ అశోక్, విద్యార్థి, యువజన సంఘము నాయకులు రియాజ్, రాహుల్, నెట్టేకల్ తదితులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button