Devanakonda

భగత్ సింగ్ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలి

దేవరకొండ (పల్లె వెలుగు) 28 సెప్టెంబర్:  భారత స్వాతంత్ర్య ఉద్యమం లో సర్దార్ భగతసింగ్ కీలక పాత్ర వహించాడని అందుకు ఆయన కు ఇచ్చే గౌరవం ఆయన జీవిత చరిత్ర ను పాఠ్య పుస్తకాలలో చేర్చడమేనని సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్.నరసరావు,సహాయ కార్యదర్శి ఎమ్.వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి ఎమ్.నెట్టేకల్ లు ప్రభుత్వాన్ని కోరారు. భగత్ సింగ్ 114 వ జయంతి కార్యక్రమం సీపీఐ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ చరిత్ర  పాఠ్యపుస్తకాల లో చేర్చాలని లేకపోతే భవిష్యత్తు లో  స్వాతంత్ర్య ఉద్యమ కారుడైన ఆయన చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు. 114 సంవత్సరాలు అయినా కూడా  ఆయన ఆదర్శాలు, త్యాగాలు  దేశానికి, విద్యార్థులు కు చెప్పే ప్రయత్నం ప్రభుత్వాలు చెయ్యడం లేదన్నారు. దేశ యువత అంతా ఎకతాటిపైకి వచ్చి స్వాతంత్ర్యo తీసుకోవడంలో కీలక పాత్ర పోషించి స్వాతంత్ర్యo సాధించారన్నారు. అనేకమంది స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని జీవితాన్ని త్యాగం చేసిన అనేకమంది త్యాగదనుల చరిత్రను మరిచిపోయి, వక్రీకరిస్తుందని అన్నారు. భగత్ సింగ్ స్పూర్తితో  నేటి యువత  తమ హక్కుల కై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ మండల నాయకులు భాస్కర్, మధు, ఫయాజ్, శివ, మధు, రంగస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.

భగత్ సింగ్ జీవిత చరిత్రను విద్యార్థుల పాఠ్యపుస్తకాలు లో చేర్చాలి.

ఎం.జగదీష్, రైతుసంఘం జిల్లాసహాయ కార్యదర్శి

దేవరకొండ (పల్లె వెలుగు) 28 సెప్టెంబర్:  భారత స్వాతంత్ర్య ఉద్యమం లో యువత కీలకపాత్ర వహించడం లోసర్ధార్ భగత్ సింగ్ మరణం కీలక మలుపు అని రైతుసంఘం జిల్లాసహాయ కార్యదర్శి ఎం.జగదీష్, భారత్ సైనికుడు రామాంజనేయులు, AISF జిల్లా మాజీ కార్యదర్శి శివశంకర్ లు ప్రభుత్వాన్ని కోరారు. భగత్ సింగ్ 115వ జయంతి కార్యక్రమం వేంకటేశ్వర కళాశాల యందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ సర్దార్ భగత్ సింగ్ చరిత్ర  పాఠ్యపుస్తకాలు లో చేర్చాలని లేకపోతే భవిష్యత్తు లో  స్వాతంత్ర్య ఉద్యమ కారుడైన ఆయన చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి ఉందన్నారు. 115 సంవత్సరాలు అయినా కూడా  ఆయన ఆదర్శాలు, త్యాగాలు ను దేశానికి, విద్యార్థులు కు చెప్పే ప్రయత్నం ప్రభుత్వాలు చెయ్యడం లేదని అన్నారు. సర్దార్ భగత్ సింగ్ 1907  సెప్టెంబర్ 28 న ప్రస్తుత పాకిస్తాన్ లోని బంగా గ్రామంలో  సర్దార్ కిషన్ సింగ్,విద్యావతి దంపతులు కు జన్మించారు, జలియాన్ వాలా బాగ్  ఘటన తరువాత భారత దేశ స్వాతంత్ర్య  ఉద్యమం లో  పాల్గొని బ్రిటిష్ పాలకులను తరిమికొట్టే క్రమం లో తన స్నేహితులతో కలిసి ఉద్యమించి బ్రిటిష్ పాలకుల చేత 1931 మార్చి 23 న రాజగురు,సుఖ్ దేవ్ లతో కలసి భగత్ సింగ్ ను అర్థరాత్రి  ఉరితీశారు.తదనంతరం దేశ యువత అందరూ ఎకతాటిపైకి వచ్చి స్వాతంత్ర్యo తీసుకోవడం లో కీలక పాత్ర పోషించి స్వాతంత్ర్యo సాధించారన్నారు. అనేకమంది స్వాతంత్ర్య ఉద్యమం లో పాల్గొని జీవితాన్ని త్యాగం చేసిన అనేకమంది త్యాగదనుల చరిత్రను మరిచిపోయి, వక్రీకరిస్తుందని అన్నారు. భగత్ సింగ్ స్పూర్తితో  నేటి యువత  తమ హక్కులు కై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాలేజి మేనేజ్మెంట్, విద్యార్థులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button