Devanakonda

భారత్ బంద్’ కు సహకరించి ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు

  • దేవనకొండ లో బంద్ విజయవంతం..
  • రైతన్నను దివాలా తీయించే చీకటి చట్టాలను రద్దు చేయాల్సిందే.
  • ప్రజా, కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి.

దేవరకొండ (పల్లె వెలుగు) 27 సెప్టెంబర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ  జరిగిన భారత్ బంద్  వామపక్షాలు, విపక్షాల నాయకులు ఎమ్.నరసరావు,బి.అశోక్ ల ఆధ్వర్యంలో సోమవారం ప్రధాన రహదారిలో, వ్యాపార కూడళ్ళలో మోటార్ సైకిళ్ళతో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యాపారులు, బ్యాంకులు, వాణిజ్య, వ్యాపార వర్గాల వారు స్వచ్ఛంద సంస్థలు బంద్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా *సిపిఐ, సీపీఎం, టీడీపీ,కాంగ్రెస్ లోకసత్తా, బీఎస్పీ,ఎమ్మార్పీఎస్, నాయకులు మద్దిలేటిశెట్టి, వీరశేఖర్,విజయభాస్కర్ గౌడ్,ఉచ్చీరప్ప, ఆకుల విరేష్, సుధాకర్ మాదిగ,రామదాసు గౌడ్, వెంకటేశ్వర్లు, బండ్లయ్య, శ్రీనివాసులు,యూసుఫ్, రాజశేఖర్, రవి,లు మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాల రద్దు, నిత్యావసరాలు, ఇందన ధరలు పెరుగుదల, ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ నిర్ణయాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాపితంగా ఉన్న 19 రాజకీయ ప్రతిపక్షాలు, అనుబంద కార్మిక, ఉద్యోగ, రైతు, విద్యార్థి, యువజన సంఘాలు భారత్ బంద్ లో పాల్గొన్నారని తెలిపారు. *బంద్ కార్యక్రమంలో మండల అఖిలపక్ష పార్టీల నాయకులు చాంద్, బజారి, ప్రసాద్,శ్రీనివాసులు, సుల్తాన్, మస్తాన్,విరేష్, నెట్టేకల్,సూరిసంజన్న, మహేంద్ర, బండ్లయ్య, గోవిందు, మధు, శ్రీరాములు,రంగన్న, అబ్దుల్, బాష, తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button