Devanakonda

వ్యవసాయాన్ని తాకట్టుపెట్టడం కూడా దేశభక్తేనా మోడీజీ

ఆంద్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్

దేవనకొండ  (పల్లె వెలుగు) 27 సెప్టెంబర్:  రైతులకు మేలుచేసే చట్టాలు అయితే రైతులు దగ్గరికి చర్చలుకు రావాలి, భూమి నుండి రైతును, పేదలకు తిండిని దూరం చేసి, రైతును వ్యవసాయ కూలీలుగా, కార్పొరేట్ వ్యాపారులు కు బానిసలుగా మార్చే 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఆంద్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయకార్యదర్శి ఎం.జగదీష్ కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతువ్యతిరేఖ నల్ల చట్టాలు రద్దు చేయాలని,మద్దతు ధర గ్యారెంటీ చట్టం చెయ్యాలని, విశాఖ ఉక్కు ప్రవేటికరణ ను ఆపాలి అని, పెట్రోల్,  డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్స్ తో భారత బంద్ పిలుపులో భాగంగా దేవనకొండ టర్నింగ్ లో కర్నూలు-బళ్ళారి రోడ్డు నందు నిరసన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం మండల కార్యదర్శి శివశంకర్ అధ్యక్షత న నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.జగదీష్ మాట్లాడుతూ దేశ సంపదలో సగం వాటా కలిగివున్న వ్యవసాయ, అనుబంధ రంగాలు ను కార్పొరేట్ చేతుల్లోకి అప్పజెప్పే కుట్ర తప్ప ఈ చట్టాలు వల్ల రైతుకు జరిగే లాభం ఏమి లేదన్నారు. ఇప్పటికే BSNL, LIC, పోర్టు లు, విమానాశ్రయాలు, విద్య, వైద్యం లను ప్రయివేట్ పరం చేసిన మోడీ ప్రభుత్వం అత్యధిక ప్రభుత్వ సంస్థలు ను ప్రయివేటు పరం చేసి మోడీ ప్రభుత్వం రికార్డు సృష్టించినది అనిఆయాన అన్నారు. గతంలో తిండి గింజలు దొరక్క పస్తులుతో ఆకలి చావులు అధికంగా ఉండేది, అయితే ఈ సరికొత్త చట్టాలు ద్వారా పండించిన పంటను కూడా తినే పరిస్థితి ఉండదని కార్పొరేట్ వ్యాపారులు తయారు చేసే వస్తువులు కు వారే ధర నిర్ణయం చేసే అధికారం ఉన్నపుడు, రైతు కష్టపడి పండించే పంటకు ఎందుకు తానే ధర నిర్ణయం చేసే హక్కు ఉండదు అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి లో ఒకలా,ఢిల్లీ లో ఇంకొక లా ప్రవర్తిస్తుంది అని పార్లమెంట్ లో రైతు వ్యతిరేక బిల్లు కి మద్దతిస్తూ, రాష్ట్రంలో చట్టాల వ్యతిరేఖ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ఏంటి అని, రాష్ట్ర అధికార వైస్సార్, ప్రతిపక్ష టీడీపీలు ద్వంద్వ వైఖరి మాని పార్లమెంట్ లో వ్యతిరేఖించాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా నాయకులు శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం నాయకులు మాదన్న, నర్సయ్య, వి.రాజు,జి. నాగరాజు, ఎం.రాజు, వి.నాగరాజునల్లన్న, మహేష్ నాయుడు, మాభాష, వీరేశ్, రాజాక్, లక్ష్మన్న, వెంకన్న, సోముడు, సలాం తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button