Devanakonda

దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: పురుషోత్తం రెడ్డి

దేవనకొండ ( పల్లె వెలుగు) 25 సెప్టెంబర్:  స్థానిక దేవనకొండ నందు ఈ నెల 7 వ తేదీ సాయంత్రం 7:30 గంటలకు బి జె పి ఆదోని డివిజన్ ఇంచార్జ్ హైకోర్టు సీనియర్ లాయర్ పురుషోత్తం రెడ్డి బి జె పి  జెండా ను ఆవిష్కరించారు తధానంతరం ఆయన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ఆ ప్రసంగంలో  అధికార పార్టీ మరియు ఆపార్టీ చేస్తున్న అవినీతి గురించి మాట్లాడుతుండగా అక్కడే ఉన్న అధికార పార్టీ నాయకులు మా నాయకుడి గురించి మాట్లాడడానికి నీకు హక్కు లేదని ప్రసంగిస్తున్న పురుషోత్తం రెడ్డి పైన మరియు బి జె పి పార్టీ కార్యకర్తల పైన దాడిగి దిగారు ఈ విషయం పై యస్ పి కి కూడా తెలియ జేశామని అన్నారు ఈ విషయం పై ఆయన శనివారం పార్టీ కార్యకర్తలతో కలిసి దేవనకొండ బాస్స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీగా బయలుదేరి దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని అక్కడే విలేకరులతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ ఈ నెల 7 వ తేదీ న నాపైన మరియు మా కార్యకర్తలు పైన దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని ఆయన అన్నారు అంతేకాక స్థానిక యస్ ఐ కిరణ్ బాబు అధికార పార్టీ కి తొత్తుగా పనిచేస్తూ ప్రజా స్వామ్యనికి తూట్లు పొడుస్తున్నాడు అని అలాగే దాడి జరిగిన సమయంలో యస్ ఐ అక్కడే ఉండి కూడా ఏమిచేయలేదని అంతేకాక దాడి చేసిన వారిని వదిలి నా చేతిలో మైక్ లాగేస్తున్నాడు తప్ప వారిని ఆపలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాక  గతంలో మినిస్టర్ జయరాముడు పై హైకోర్టు లో కేసు వేశానాని నాకు ఫోన్ కాల్ చేసి నన్ను భయపెట్టి బెదిరించినారు అని ఆవిషయంలో వారిపై కేసు కూడా నమోదు చేశారని అది ఇప్పుడు ఎమ్మిగనూరు కోర్ట్ లో నడుస్తుంది అని ఇప్పుడు కూడా వాళ్లే ఈ దాడికి పాల్పడ్డారు అని ఆయన ఆవేదన చెందారు వారి పేర్లు కూడా పోలీస్ లకు ఇచ్చామని అన్నారు 1 పెద్దన్న దేవనకొండ 2చెన్నప్ప దేవనకొండ3 చిన్నా రెడ్డి దేవనకొండ  4 మద్దికెర అంజి దేవనకొండ 5 విజయ్ వెలమకూరు 6 బోయ రాజు 7 చాకలి రాజశేఖర్ దేవనకొండ 8 మాదిగ వీరభద్ర దేవనకొండ 9 ఇశుప్ బాషా దేవనకొండ వీరు గతంలో మరియు ఇప్పుడు కూడా నామీద దాడి చేసిన వారు అని ఆయన తెలిపారు అలాగే బిజెపి ని తక్కువ అంచనా వేయొద్దని అని రాష్ట్రం లో మరియు కేంద్రం లో నీతి నిజాయితీ గల ఏకైక పార్టీ బిజెపి అని వారున్నారు అలాంటి మాపై దాడి చేస్తే సామాన్యుల పరిస్థి ఏంటి అని వారు అన్నారు పోలీస్ లు కూడా దాడులకు సహకరించడం ఎంతవరకు సమంజసం అని వారు అన్నారు అక్టోబర్ 2 వ తేదీ లోగా వారిని అరెస్టు చేయక పోతే దేవనకొండ అంబేత్కర్ విగ్రహం ముందు అదేరోజు అనగా అక్టోబర్ 2 వ తేదీ బీజేపీ జిల్లా నాయకులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాము అని వారు హెచ్చరించారు ఈ కార్యక్రంలో దేవనకొండ బీజేపీ మండల అధ్యక్షుడు బోడ రవికుమార్ మరియు దేవనకొండ మండల ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button