Devanakonda

దేవనకొండ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి రైతుల అప్పులు రద్దుచేయాలి

ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించిన ఆంద్రప్రదేశ్ రైతుసంఘం బృందం

దేవరకొండ (పల్లె వెలుగు) మండలం లో ఖరీఫ్ సీజన్ లో తక్కువ వర్షాలు కురవడం వల్ల రైతులు వేసిన పంటలు వేరుశనగ, పత్తి ఎదుగుదల లేక, పంటలు రాక పెట్టిన పెట్టుబడులు చేతికి వచ్చే పరిస్థితి కూడా లేదని,ప్రభుత్వం, అధికారులు రైతులు పంట పొలాలను పరిశీలించి,రైతును ఆదుకోవాలని ఆంద్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్ కోరారు. ఎండిపోయిన వేరుశనగ, పత్తి పంటలు ను ఆంద్రప్రదేశ్ రైతుసంఘం బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్ లు మాట్లాడుతూ తక్కువ వర్షం కురవడం వల్ల అనావృష్టి ఏర్పడి, దుక్కి దున్నాడానికి, విత్తనాలు, ఎరువుల, మందులు కు,వ్యవసాయ కూలీలు కు ఎకరానికి సుమారుగా 50వేల నుండి 1లక్ష పైగా ఖర్చు అయ్యింది అని,ఆయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టిన పెట్టుబడులు కూడా రైతు చేతికి రాదని గత సంవత్సరం ఎక్కువ వర్షాలు వల్ల పంటలు కుళ్ళిపోయాయి, ఈ సంవత్సరం పంటలు ఎండిపోయాయి అన్నారు. గత సంవత్సరం చేసిన అప్పులే తీరని స్థితిలో ఈ సంవత్సరం కూడా అప్పులు, వడ్డీలు పెరిగిపోయాయి అన్నారు. అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు పంట పొలాలు పరిశీలించి, దేవనకొండ మండలాన్ని కరువు మండలం గా ప్రకటించి, రైతులు అప్పుల రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు నాగరాజు, కోదండ, నర్సయ్య, మహేష్, నరేంద్ర రైతులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button