Devanakonda

స్కీమ్ వర్కర్స్ సమ్మె తోనైనా ప్రభుత్వం దిగి రావాలి

ఏఐటియుసి ఆధ్వర్యంలో దేవనకొండ లో సమ్మె విజయవంతం

దేవనకొండ (పల్లె వెలుగు) 24 సెప్టెంబర్: కేంద్ర ప్రభుత్వం స్కీముల్లో పని చేస్తున్నా అంగన్వాడి, ఆశ, మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులు ఏఐటియుసి ఇతర కేంద్ర  కార్మిక సంఘాలు చేపట్టిన ఒకరోజు సమ్మెకు పిలుపు ఇవ్వడం జరిగిందని వర్కర్స్ అందరూ పాల్గొని జయప్రదం చేశారని ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎమ్.నరసరావు,జిల్లా సహాయ కార్యదర్శి ఎమ్.తులసి, అంగన్వాడి యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు సజీవమ్మ, విమల లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక సిపిఐ కార్యాలయం నుండి  స్కీమ్ వర్కర్లు, కార్మికులు నినాదాలు చేస్తూ ర్యాలీ గా తహశీల్దార్ కార్యాలయం వరకు వెళ్లి ధర్నా నిర్వహించారు. ధర్నా ను ఉద్దేశించి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల్లో పనిచేస్తున్న అందరిని వర్కర్స్గగా గుర్తించాలని ,నెలకు కనీస వేతనం 21000 ఇవ్వాలని పిఎఫ్, ఈ ఎస్ ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలన్నారు, కోవిడ్ బారినపడి మరణించిన స్కీం వర్కర్లకు 50 లక్షలు బీమా పథకం అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు, ప్రజావ్యతిరేక వ్యవసాయ చట్టాలు మరియు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లు రద్దు చేయాలన్నారు, సార్వత్రిక ఆరోగ్య హక్కు కోసం చట్టం చేయాలన్నారు, స్థూల జాతీయ ఉత్పత్తి లో మూడు శాతం ఆరోగ్యానికి ,ఆరు శాతం విద్యకు ఖర్చు పెట్టాలన్నారు, ప్రాథమిక ఆరోగ్య, విద్య, పోషకాహార సర్వీసుల ప్రైవేటీకరణ విరమించాలన్నారు,  కోవిద్ డ్యూటీలు చేస్తున్న వర్కర్లకు నెలకు పదివేల అదనపు వేతనం ఇవ్వాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలన్నారు. పాలకులు ఇప్పటికైనా దిగి వచ్చి న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం సిద్ధం కావాలని కోరారు. లేనిపక్షంలో భవిష్యత్ లో జరగబోవు ఆందోళన పోరాటాల వలన జరిగే పరిణామాలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎమ్.వెంకటేశ్వర్లు, నాయకులు సుల్తాన్, శ్రీనివాసులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు నాగవేని, ప్రశాంతి, విజయలక్ష్మి, నాగలక్ష్మి, రాధిక, రాధమ్మ, హైమావతి, తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button