
ఉల్లి,టమోటో రైతులను ఆదుకోవాలి
- రైతు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలి.
- రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్
దేవనకొండ (పల్లె వెలుగు) రైతులు పండించిన ఉల్లి,టమోటో తదితర కూరగాయ పంటలకు మద్ధతు ధర కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్ డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట మండల కార్యదర్శి శివశంకర్ అధ్యక్షత న ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్ మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో కరువు ని తట్టుకొని,వేల రూపాయలు పెట్టుబడి పెట్టి,సాగుచేసి,విత్తనాలు, ఎరువులు, మందులు కొని టమోటో, ఉల్లిని ఎక్కువగా పండిస్తున్నారని, అయితే పండించిన పంటలకు పెట్టుబడి కూడా చేతికి రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. 28కేజీ లు టమోటో బాక్స్ 100 రూపాయలు మార్కెట్ ధర అమ్ముడుపోతుందిఅని కిలో టమోటో ధర.3 రూపాయల ధర పోతే ,పెట్టిన పెట్టుబడులు, కోసిన కూలీ ఖర్చులు 250 ఒక్కరికి, రవాణా చార్జీలు బాక్స్ కు 10 నుండి 30 రూపాయల వరకు అవుతుంది అని ఈ లెక్కన రైతుకు ఎంత మిగులుతుందో ప్రభుత్వం, అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. టమోటో సాగుకు ఎకరానికి 50 వేల రూపాయలు, ఉల్లికి 1 లక్ష పైబడి పెట్టుబడి అవుతుంది అని,ధరల స్థిరీకరణ నిధి 3వేల కోట్ల తో ఏర్పాటు చేసింది నిజమైతే ఎందుకు రైతును ఆదుకోవడం లేదని ప్రశ్నించారు రైతులు పండించిన పంటలకు మద్ధతు ధర ప్రకటించి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులువెంకటేశ్వర రెడ్డి ఇబ్రహీం, నరసయ్య, ఆంజనేయులు, మోదీన్, రాజు, నాగరాజు, నెట్టేకల్, విజయ్, మహేష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.