Devanakonda

రైతాంగ, కార్మిక, వ్యతిరేక చట్టాల రద్దు కై భారత్ బంద్ జయప్రదం చేయండి

దేవనకొండ (పల్లె వెలుగు) 23 సెప్టెంబర్:  రైతు, కార్మిక వర్గ వ్యతిరేకంగా బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో గత పది నెలలుగా పోరాడుతున్న రైతులకు న్యాయం చేయ్యకపోగా దేశానికి అన్నం పెట్టే రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిరసనగా ఈ నెల 27 న జరగబోయే భారత్ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా నాయకులు బి.వీరశేఖర్, సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్.నరసరావు, టీడీపి మండల నాయకులు పి.మొలకన్న, లోకసత్తా పార్టీ నాయకులు రామదాసు, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు సుధాకర్ మాదిగ, సీఐటీయూ జిల్లా నాయకులు దస్తగిరి కాంగ్రెస్ మండల నాయకులు శ్రీనివాసులు లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం మండల కేంద్రం లోని హమాలి యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశం  వామపక్ష పార్టీల నాయకులు వెంకటేశ్వర్లు, సూరిసంజన్న అధ్యక్షత న జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఫాసిస్టు నిరంకుశ పాలన సాగుతోందని ఆరోపించారు. పలు దశాబ్దాలుగా రక్తం దారపోసి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తుందని నూరేళ్లు గా రైతులు, కార్మికులు అభివృద్ధి చేసిన భారతదేశ సంపదను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ పెట్టబడి దారులకు తెగనమ్ముతుందని దుయ్యబట్టారు. అనేక మంది ప్రాణ త్యాగాల ఫలితంగా సాదించుకున్న ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు ను అమ్మడానికి పూనుకుందని ఆరోపించారు. ఎన్నో ఏళ్ళు గా కార్మికులు పోరాడి సాధించుకున్న, కనీస వేతనం, ఉద్యోగ భద్రత హక్కులను కాలరాస్తు కారుచౌకగా కార్మికుల శ్రమను పెట్టుబడి దారులు కొల్లగొట్టెందుకు లేబర్ కోడ్ లతో కార్మికులను దగా చేస్తుందన్నారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఇలా పెరగడం చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. కనుక కార్మిక వర్గ హక్కుల రక్షణ కోసం వ్యవసాయ నల్లచట్టాలను, విద్యుత్ చట్ట సవరణల రద్దు చేయాలని ఈనెల 27 న భారత్ బంద్ కు మండల వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి యూసుఫ్, టీడీపి మండల నాయకులు మస్తాన్,నాయకులు అశోక్,బడేసాహెబ్, తదితరులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button