Devanakonda

సెప్టెంబర్ 27 న దేశవ్యాప్త రైతుబంద్ ను జయప్రదం చేద్దాం

సీపీఐ, రైతుసంఘం ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమంలో ఎం.జగదీష్ పిలుపు

దేవరకొండ (పల్లె వెలుగు) 22 సెప్టెంబర్:  పది మాసాలుగా రైతు వ్యతిరేక నల్లచట్టాలు రద్దు కై ఢిల్లీలో జరుగుతున్న  ఆందోళనలు కు మద్ధతుగా నల్లచట్టాలు రద్దుకు సెప్టెంబర్ 27 న నిర్వహించే దేశవ్యాప్త భారత్ బంద్ లో యావత్తు ప్రజానీకం పాల్గొని విజయవంతం చేయాలని సీపీఐ, ఆంద్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో కరపత్రాలు పంచి  ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతుసంఘం జిల్లాసహాయ కార్యదర్శి ఎం.జగదీష్ మాట్లాడుతూ పార్లమెంట్ లో చట్టాలు చేసిన పెద్దలు రైతుల స్థానం లో ఉండి పొలాల్లో వ్యవసాయం చెయ్యాలని ఎప్పుడైనా రైతు కష్టం తెలిసొస్తుంది .రైతు ఈ దేశానికి శ్రమ పడి రక్తాన్ని ధారపోసి, చెమట చిందించి పండిస్తే ఎక్కడో  విలాసవంతమైన జీవితాన్ని గడిపే మీకు రైతు శ్రమ ఎలాతెలుస్తుంది. రైతులపై సినిమా తీస్తే కోట్లరూపాయలు లాభం, రైతు పంటను కొని తిరిగి అమ్ముకొని దళారులు కు విలాసవంతమైన జీవితం,రైతు ఉత్పత్తులు ను అలంకరణ చేసి సూపర్ మార్కెట్ లో సంచుల్లో అమ్మినవాడు ధనవంతు అవుతున్నాడు కానీ నిరంతర శ్రమచేసే రైతు నష్టాన్ని ఎదుర్కొన్న,అప్పులు చేసి, పస్తులు ఉండి కూడా దేశానికి ,ఈ నల్ల మూడు చట్టాలు చేసిన పార్లమెంట్ సభ్యులు కు కూడా అన్నం పెడుతున్నాడని,కానీ రైతు నిజాయితీ ని గుర్తించని మోడీ ప్రభుత్వం అదే రైతుకు మట్టికొడుతున్నాడని అన్నారు. కార్పొరేట్ వ్యాపారులు తరుపున చట్టం చేసిన మోడీ వారికి మాత్రమే ప్రధాని కాదని,యావత్ భారతదేశం కు ప్రధాని అని అలాంటప్పుడు 130 కోట్ల పేద  జనాభా పక్షాన నిలాల్సింది పోయి ఇలా వ్యతిరేకంగా చట్టాలు చెయ్యడం ప్రధాని స్థాయికి తగదు అన్నారు. ఈ 3 నల్ల చట్టాలు ను పార్లమెంట్ లో రద్దు చేసి రైతు పక్షాన నిలవాలని డిమాండ్ తోరాజకీయపార్టీలు, విద్యార్థి,యువజన, కార్మిక,కర్షక సంఘాలు మద్దతో  27 న బంద్ లో దేశ ప్రజానీకం పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, గోవిందు,నరసయ్య, రాజు,మహేష్,విజయ్,తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button