Devanakonda

24న స్కీం వర్కర్స్ జాతీయస్థాయి సమ్మె ను జయప్రదం చేయండి

దేవరకొండ (పల్లె వెలుగు)21 సెప్టెంబర్: స్కీమ్ వర్కర్స్ (ఏఐటీయూసీ) జాతీయ స్థాయిలో స్కీం వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని అనేక రూపాల్లో కార్మిక సంఘాలు ఆందోళన చేసినప్పటికీ వారి సమస్యలు పరిష్కరించడంలో అధికార కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జాతీయ స్థాయి సమ్మె సెప్టెంబర్(ఈనెల) 24న నిర్వహిస్తున్నామని సమ్మెను జయప్రదం చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి ఎమ్.తులసి, మండల ఉపాధ్యక్షులు విజయలక్ష్మి, నాగవేని, సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎమ్.వెంకటేశ్వర్లు, పట్టణ సహాయ కార్యదర్శి ఎమ్.నెట్టేకల్ లు పిలుపునిచ్చారు.మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ… ప్రభుత్వ పథకాలలో పనిచేసే వారందరిని “వర్కర్లుగా” గుర్తించి నెలకు ఇరవై ఒక్క వేలు కనీస వేతనం పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్ సదుపాయాలు కల్పించాలన్నారు. స్కీమ్ లు అన్నింటిని సంస్థాగతం చేసి స్కీం వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ వర్కర్ల అందరికీ రేషన్ కార్డులు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. అలాగే ప్రజా వ్యతిరేక వ్యవసాయ చట్టాలు మరియు కార్మిక వ్యతిరేక లేబర్  కోడులు రద్దు చేయాలన్నారు. కరోన విధులు నిర్వహించిన స్కీం వర్కర్లకు నెలకు 10,000 అదనపు వేతనం ఇవ్వాలన్నారు. పై డిమాండ్ల సాధన కోసం ఈనెల24 న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో జరిగే ప్రదర్శనలను జయప్రదం చేయాలని వారు తెలిపారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button