Devanakonda

27 న భారత్ బంద్ ను జయప్రదం చెయ్యండి

  • రైతు, కార్మిక, విద్యార్థి,యువజన సంఘాలు పిలుపు.
  • నల్లచట్టాలు రద్దుకై పోరాటం ఉధృతం.
  • రైతుసంఘం జిల్లాసహాయ కార్యదర్శి. ఎం.జగదీష్

దేవనకొండ(పల్లె వెలుగు) 21 సెప్టెంబర్: నల్లచట్టాలు రద్దుకై  దేశవ్యాప్తంగా ఈ నెల 27న జరిగే బంద్ ను జయప్రదం చెయ్యడానికి  కార్మిక, విద్యార్థి, యువజన సంఘాలు కలసి దేశ రైతు కోసం ఉద్యమిస్తామని కార్మిక, రైతు, విద్యార్థి, యువజన సంఘాలు స్పష్టం చేశాయి. స్థానిక సీపీఐ కార్యాలయం ఎదుట బంద్ గోడపత్రికలు రైతుసంఘం జిల్లాసహాయ కార్యదర్శి ఎం.జగదీష్, మండల కార్యదర్శి శివశంకర్, ఏఐటీయూసీ నాయకురాలు తులసమ్మ, మహాలక్ష్మి, ఏ.ఐ.ఎస్. ఎఫ్. జిల్లకార్యవర్గ సభ్యులు. విజయ్, బాబు  ఏ.ఐ.వై.ఎఫ్ జిల్లాకార్యవర్గ సభ్యులు, నెట్టేకల్, ఎం.రాజు, రైతుసంఘం నాయకులు కోదండ, యూసుఫ్, ఆంజనేయులు తదితరులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంవత్సరం కాలంగా ఢిల్లీ లో రైతులు తమనుండి వ్యవసాయాన్ని లాక్కోవద్దు అని, మేము శ్రమచేసి దేశానికి అన్నం పెడతామని, మాకు దగ్గరగా సరుకు అమ్ముకోవడానికి అవకాశం లేకుండా చెయ్యొద్దు అని మీ ప్రభుత్వానికి మామీద కనికరం ఉంటే మాకు మార్కెట్ వ్యవస్థను దగ్గరికి తీసుకొని రావాలని, మాభూమి పై మాకే హక్కు కల్పించాలని కోరుతున్నారని కనికరం లేని కసాయి కేంద్రప్రభుత్వం రైతులు యొక్క బాధలు అర్థం చేసుకోకుండా కార్పొరేట్ వ్యాపారులు తరుపున వకల్తా పుచ్చుకుని రైతుని అన్యాయం చేసి వ్యవసాయం ను శ్రమజీవులుకు దూరం చేసేందుకు కుట్రపన్ని పేదలకు అన్నం కూడా దూరం చేసే పరిస్థితులుకు వ్యతిరేకంగా మొక్కువోని కార్యదక్షత తో పోరాడుతున్న రైతుకుమద్దతుగా పోరాటం లో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

D.N.T హాస్టల్ కు సొంతభావనాలు నిర్మించి, తిరిగి ప్రారంభించాలి MRO కార్యాలయంలో

సీనియర్ అసిస్టెంట్ నభిరసుల్ కు వినతి

ఎన్నో ఏళ్లుగా కరువు ను ఎదుర్కొంటూ విద్యకు దూరమై వలసలు వెళ్లి నిరక్షరాస్యత పెరిగిన నేపథ్యంలో 40 సంవత్సరాల క్రితం  D. N. T హాస్టల్ ఏర్పాటు చేసిన హాస్టల్ లో వేలమంది పేద విద్యార్థులు చదువు కుని ఉన్నతస్థానాల్లో ఉన్నారని, మండల కేంద్రంలో ఉన్న ఏకైక హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించక,మౌళిక సదుపాయాలు కల్పించక తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇక్కడ చదివిన విద్యార్థులు వర్షం లొనే తిని , పందులు, దోమలు మధ్య తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఎవ్వరుకుడా ఇక్కడ చేరక  నేడు విద్యార్థులు లేరన్న నెపంతో మూసివేయడం తగదని, తక్షణమే నూతన బిల్డింగ్ నిర్మించి, హాస్టల్ ను పునప్రారంభం చెయ్యాలి అని కోరారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button