Devanakonda

ఘనంగా ప్రధాన మంత్రి పుట్టినరోజు వేడుకలు

దేవనకొండ (పల్లె వెలుగు) 17 సెప్టెంబర్: నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా దేవనకొండ బిజెపి మండల అధ్యక్షుడు బొడా రవి కుమార్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయం నందు కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. తదనంతరం నిరాశ్రయులకు బిర్యానీ, గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పండ్లు బ్రేడ్ పంచడం జరిగింది.  రక్తదానం చెయ్యడం జరిగింది. బొల్లెద్దుల కిరణ్ కుమార్ మాట్లాడుతూ20 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో ఎటువంటి అవినీతి ఆరోపణలు లేని నాయకుడు ఎవరైనా వున్నారు అంటే అది మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ సాధ్యం అన్నారు. ఇకపై ప్రతి గ్రామం లో పర్యటిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేయటానికి ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button