Devanakonda

హంద్రీనీవా కాలువకు మరమ్మతులు చేపట్టి తక్షణమే నీటిని విడుదల చేయాలి

రైతులు సాగు చేసుకున్న పంటలు సాగునీరు విడుదల చేయాలి

దేవనకొండ (పల్లె వెలుగు) 14 సెప్టెంబర్:  హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా ప్రవహిస్తున్న సాగునీరు గత పది రోజులుగా నిలిచిపోవడం వలన రైతులు సాగు చేసుకున్న పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి, కావున తక్షణమే నీటిని విడుదల చేయాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు మండల నాయకులు నరేంద్ర, రాజా సాహెబ్ లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం రైతులతో కలిసి తాసిల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ప్రవహిస్తున్న హంద్రీ నీవ నీరు నిలిచి పోవడం వలన రైతులు సాగు చేసుకున్న పత్తి, వేరుశనగ, మిరప, ఉల్లి తదితర పంటలు ఎండిపోయే దశకు చేరుకున్న ఈ నీటిని విడుదల చేయాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న పంట కాలువల నిర్మాణం పూర్తి చేసి చివరి ఆయకట్టు రైతులందరికీ సాగునీరు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, వివిధ గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button