
పత్తి పంటలో గులాబి రంగు పురుగు పై అవగాహన కార్యక్రమం
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవసాయ శాఖ మరియు కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో పత్తి పంటలో గులాబి రంగు పురుగు పై అవగాహన కార్యక్రమం
దేవరకొండ (పల్లె వెలుగు) 11 సెప్టెంబర్: దేవనకొండ మండల పరిధి వెలమకూరు, కుంకునూరు గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ వ్యవసాయ శాఖ మరియు కృషి విజ్ఞాన కేంద్రం వారి ఆధ్వర్యంలో సోమవారం పత్తి పంటలో గులాబీ రంగు పురుగు పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించి రైతు రథం సేవలు ప్రంబించారు.రిలయన్స్ ఫౌండేషన్ సీఆర్పీ చిన్న మాట్లాడుతూ పత్తి ప్రస్తుతం ఉన్న పంట దశ ఆధారంగా పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుందని నివారణకు ప్రతి 20 రోజులకొక సారి వేపనూనెతో పిచికారి చేయించాలని,లింగాకర్షక బుట్టలు ఒక్క ఎకరాకు 6 నుండి 8 పెట్టుకోవాలని,పంటకు అవసరమైన సూటి ఎరువులు,లింగాకర్షక బుట్టలు వాడి పెట్టుబడి కర్చును తగ్గించుకోవాలని తెలియజేశారు.పురుగు ఉదృతి వల్ల కలిగే నష్టాన్ని వివరించారు.రైతులందరూ సామూహికంగా నివారణ చర్యలు,సమగ్ర యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు,లీటర్ నీటికి
- క్లోరిపైరిఫాస్2.5 మి.లీ.
- క్వినాల్ ఫాస్2.0 మి.లీ.
- ప్రొఫనో పాస్2.0 మి.లీ.
- తయొడికర్బ్ 1.5 గ్రా.
- మార్చి మార్చి45-120 రోజుల లో పిచికారి చేసుకోవాలన్నారు.
గులాబి రంగు పురుగు నివారణ పై రైతులకు పూర్తి సమాచారం ఇచ్చేందుకు దేవనకొండ మండలము కరివేముల, కరీడికొండ, పాలకూర్తి, తెర్నకల్, నెల్లిబండ, మాచాపురం, పి. కోటకొండ, అలారుదిన్నె, నెలతలమర్రి, నల్లచెలిమల గ్రామాల్లో రైతు చైతన్య రథం ద్వారా ప్రచారం నిర్వహిస్తాంన్ని తెలిపారు. తొలి దశలనుండి వేప నూనె వాడాలి అన్నారు. పంట ఎక్కువ కాలం ఉంచరాదు పంట అయిపోయిన తర్వాత పత్తి మొక్కలను కలియ దున్ని వేస్ట్ డీకంపోజర్ ద్రావణాన్ని పిచికారి చేయడం ద్వారా త్వరగా కుళ్ళిపోయి పచ్చి రొట్ట ఎరువు గా మారుతుందినీ అన్నారు. కార్యక్రమంలో రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.