
రైతు శ్రమ కు ప్రతిఫలం లేదా?
- ఉల్లి, టమోటో పంటలకు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలి
- రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్
దేవనకొండ (పల్లె వెలుగు) 10సెప్టెంబర్: శ్రమ చేసి పెట్టుబడి పెట్టి పండించినరైతు శ్రమ కి ప్రతిఫలం లేదా అని ఆంద్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్ ఆవేదన వ్యక్తంచేశారు. దేవనకొండ సీపీఐ కార్యాలయంలో ఆంద్రప్రదేశ్ రైతుసంఘం మండల ముఖ్య కార్యకర్తలు సమావేశం మండల కార్యదర్శి శివశంకర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎం.జగదీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 2021-2022 బడ్జెట్ లో వ్యవసాయానికి 31,256,36 కోట్లు రూపాయలు కేటాయించారని,ధరలు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసిన కూడా రైతులకు ఇవ్వలేదని ఆయన అన్నారు. విత్తనాలు కొని,దుక్కి దున్ని, ఎరువుల, విత్తనాలు కొని లక్షల్లో పెట్టుబడులు పెట్టి రాత్రి పగలు శ్రమ చేసిన కూడా రోజువారీ కూలి కూడా రైతుకు మిగలడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉల్లి పంట కు క్వింటాలు కి 500 నుండి 700 వరకు ధర పోతుంది అని టమోటో మార్కెట్ లో కిలో లు 60 కేజీలు కు 60 రూపాయలు పలుకుతుంది అని ప్రభుత్వం ఎంత మేరకు రైతును ఆదుకునే చర్యలు చేపడుతుందో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు . రైతు పంట నమోదు కు గడువు తేదీ ఈ నెల 15 చివరి తేదీ గా ప్రకటించారు అని కానీ ఇప్పటి వరకు సర్వర్ ప్రాబ్లమ్ వల్ల నమోదు పూర్తి కాలేదని అందరికి నమోదు చేసుకోవడానికి గడువు తేదీ పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఆఫీస్ బేరర్స్ పెనుమాడ వెంకటేశ్వర్లు,అనిల్, కోదండ, రాజు,మధు, మురళి లు పాల్గొన్నారు