
ఏఐఎస్ఎఫ్-ఏఐవైఎఫ్ రాష్ట్ర స్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయండి
దేవనకొండ లో ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం
దేవనకొండ (పల్లె వెలుగు) సెప్టెంబర్ 22 నుండి 26 వరకు ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో జరిగే ఏఐఎస్ఎఫ్-ఏఐవైఎఫ్ రాష్ట్రస్థాయి విద్య,వైజ్ఞానిక, రాజకీయ, సైద్ధాంతిక శిక్షణా తరగతులను జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజు దేవనకొండ లోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం ముఖ్య నాయకుల సమావేశంలో ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఫయాజ్, భాస్కర్ లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్య వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టడానికి, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న మహిళలపై అత్యాచారాలు, దాడులను అరికట్టడానికి ప్రతి విద్యార్థిని, విద్యార్థులను చైతన్యం చేయడానికి ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో జరిగే వర్క్ షాప్ వేదిక కానున్నది. ఈ వర్క్ షాప్ లో బోధించాడానికి విద్యారంగంపై అవగాహన ఉన్న మేధావులు, మాజీ విద్యార్థి నేత కన్హయ్య కుమార్, కేరళ మాజీ ఎంపీ బినాయ్ విశ్వం, మాజీ రాజ్యసభ సభ్యులు డి.రాజా, మన రాష్ట్రం నుండి మాజీ ఏఐఎస్ఎఫ్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కే. రామకృష్ణ , మాజీ ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకులు జి.ఈశ్వరయ్య తో పాటు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. కాబట్టి విద్యార్థిని,విద్యార్థులు పాల్గొని ఈ వర్క్ షాప్ ను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.