
అంగన్వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవాలు
పోషకాహారం గురించి అవగాహన.
దేవనకొండ (పల్లె వెలుగు) 6 సెప్టెంబర్: మండలం కరివేముల గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబరు 1 తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో సోమవారం పోషణ మహోత్సవాలు జరుపుకున్నారు సోమవారం యాక్టివిటీ అనుబంధ ఆహారం గురించి ఏడు నెలల నుండి 3 సంవత్సరాల పిల్లల తల్లులకు అనుబంధ ఆహారం ఇవ్వడం వల్ల పిల్లలలో ఎదుగుదల ,ఉంటుంది అని సమతుల ఆహారం పిల్లలలకు చాలా అవసరం అని పండ్లు , కూరగాయలు, పప్పులలో చాలా పోషకాలు అందుతాయి అని తెలియజేసారు పోషకాహారం గురించి అవగాహన ఇవ్వడం జరిగినది ఇందులో పాల్గొన్న ఐసిడిఎస్ సూపర్వైజర్ పావని, ఎం ఎస్ కె యాస్మిని, ఏఎన్ఎం హేమలత, జయమ్మ అంగన్వాడీ టీచర్స్ ప్రశాంతి,హైమావతి హెల్పర్స్ నాగమ్మ, రంగమ్మ, రిలయన్స్ ఫౌండేషన్ సీఆర్పీ చిన్న ఆశ వర్కర్స్ తార,సుజాత వాలంటరీ స్, బాలింతలు గర్భవతులు పాల్గొన్నారు.