Devanakonda

డి. ఎన్. టి హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలి

హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించడం లో ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి నశించాలి..  ఏఐఎస్ఎఫ్ డిమాండ్..

దేవనకొండ (పల్లె వెలుగు) 06 సెప్టెంబర్:  మండల కేంద్రమైన దేవనకొండ నందు గల డి. ఎన్. టి హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించడంలో అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్య వైఖరి సరికాదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు కే. శ్రీనివాసులు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం డీఎన్టీ హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు  మధు అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 30 ఏళ్లుగా డి. ఎన్. టి హాస్టల్ కు సొంత భవనాలు లేక విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందన్నారు. మండల కేంద్రంలోని డి ఎన్ టి హాస్పిటల్ కు సొంత భవనాలు లేకపోవడంతో అసలు ఇక్కడ హాస్టల్ ఉందో లేదో అన్న సందేహం కలుగుతోందన్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులు హాస్టల్ సీటు పొంది ఉన్నత చదువులు చదువుకునేందుకు ఆసక్తి చూపడం లేదన్నారు. గత కొన్ని ఏళ్లుగా హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించాలని ఆందోళన లు చేసినప్పటికీ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు కానీ నోరు విప్పడం లేదన్నారు. డిఎన్టీ హాస్టల్ కు సొంత భవనాలు తొందరలోనే నిర్మిస్తామంటూ పాలకుల హామీలు నెరవేర్చకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా మండల కేంద్రంలో ఉన్న ఒకే ఒక హాస్టల్ కు సొంత భవనాలు నిర్మించి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కల్పించే విధంగా అందుబాటులోకి తీసుకు రావాలన్నారు. లేనిపక్షంలో  ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు పూనుకుంటామని వారు హెచ్చరించారు. ధర్నా అనంతరం మండల తహశీల్దార్ ఇంద్రాణి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు భాస్కర్, ఫయాజ్, నబిరసూల్,రంగస్వామి, రాజశేఖర్, హరికృష్ణ, విష్ణు, రాజు,గోపాల్ మరియు హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

 

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button