Devanakonda

మానవత్వం చాటుకున్న వాలంటీర్

దేవనకొండ(పల్లె వెలుగు) 2 సెప్టెంబర్ : మండల కేంద్రమైన దేవనకొండ గ్రామానికి చెందిన బోయరంగన్న  అనే వ్యక్తి  డయాలసిస్ తో  బాధపడుతూ అనారోగ్యం పాలై కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ తరుణంలో అతడికి  నెల పింఛన్ అందించేందుకు  స్థానిక వాలంటీర్ రమేష్ తన సొంత డబ్బు ఖర్చుతో కర్నూల్ కి వెళ్లి ఈ కేవైసీ చేయించి బాధితుడికి ఫించన్ అందించడంతో అనారోగ్యంతో ఉన్న పింఛనుదారుడు మరియు యు.వి అతని కుటుంబ సభ్యులు వాలంటీర్ రమేష్ తమ మీద చూపిన ప్రేమ ఆప్యాయత మానవత్వాన్ని చాటుకున్నాడని వారు కొనియాడారు. వాలంటరీ రమేష్ కు వారిలో కలిగిన ఆనందాన్ని చూసి ప్రజల కోసం సేవలు అందించడంలో ఉన్న ఆనందం దేనిలో ఉండదని ఇప్పుడు నాకు ఈ క్రియ వలన కొండంత బలాన్ని చేకూరుస్తుందని కావున వాలంటీర్  రమేష్ ప్రభుత్వ స్కీములును లబ్దిదారులకు అందించేందుకు ఎంతదూరమైన వెళ్లి వారికి లబ్ధిచేకూరుస్తానని తెలిపారు .

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button