Devanakonda

రుణమాఫీ చెయ్యమని కోరితే రైతులకు ఇవ్వాల్సిన పంట నష్టపరిహారాన్ని మాఫీ చేస్తారా?

ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం

దేవరకొండ (పల్లె వెలుగు) 2 సెప్టెంబర్:  సంవత్సరాలు గడుస్తున్నా, ప్రభుత్వాలు మారినా ఇప్పటికీ 2018 లో అనావృష్టి తో పంటలు ఎండిపోయి పెట్టిన పెట్టుబడులు కూడా చేతికి రాక ఎక్కడికి అక్కడ పశువుల కు మేతకూడా దొరకని స్థితిలో కరువు జిల్లాగా ప్రకటించిన నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వక పోవడం రైతులు పట్ల హేయమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్,మండల అధ్యక్ష,కార్యదర్శి లు శివశంకర్, ఇబ్రహీం లు విమర్శించారు.స్థానిక మండల వ్యవసాయ శాఖ కార్యాలయం లో A.E.Oకి ఆంద్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో మండలానికి రావాల్సిన పెండింగ్ లో ఉన్న 2018 పంట నష్ట పరిహారం రైతులకు తక్షణమే అందజేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు  అప్పులను దశల వారిగా మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు తాము రైతులకు ఇవ్వాల్సిన పంట నష్టపరిహారం ను మాఫీ చేసే పనిలో పడ్డాయి అని అందుకే ప్రభుత్వాలు మారినా 2018 పంటనష్ట పరిహారం ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దేవనకొండ మండలానికి 24 వేల మందికి గాను 39 కోట్ల 87 లక్షలు ఇవ్వాల్సి ఉందని వారు అన్నారు. ప్రభుత్వం జాప్యం వల్ల సంవత్సరాలు గడిసిపోతున్నాయి కానీ రైతుకు పరిహారం దక్కడం లేదని వారు అన్నారు. 2021-22 బడ్జెట్లో వైస్సార్ ఉచిత పంటల భీమా కు 1802.82 కోట్లు కేటాయించిన ప్రభుత్వం  రైతులకు చెల్లించ వలసినపంటల భీమా 500 కోట్లు పెండింగ్ లో పెట్టింది అని రైతుకు బడ్జెట్ లో  కేటాయించిన మొత్తం,రైతు కోసం ఖర్చు చేసిన మొత్తానికి పొంతన లేకుండా పోయిందని వారు అన్నారు. తక్షణమే 2018 పంట నష్టపరిహారం,2020 లో ఇంకా ఇవ్వాల్సిన పంటల భీమా ను రైతుల ఖాతా లో జమచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేష్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button