
మహనీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి 12 వ వర్ధంతి
దేవనకొండ (పల్లె వెలుగు) దేవనకొండ మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ నందు డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జడ్పిటిసి అభ్యర్థి కిట్టు మాట్లాడుతూ మండల పరిధిలోని హంద్రీనీవా సుజల స్రవంతి రైట్ కెనాల్ కాలువ ద్వారా దాదాపుగా 40 వేల ఎకరాలకు సాగునీరు తాగునీరు అందించిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘనతే అని తెలపడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో హంపి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అటువంటి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందన్నారు. కప్పట్రాళ్ల మల్లికార్జున మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా విద్యార్థుల జీవితాలను మార్చే చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కప్పట్రాళ్ల దివాకర్ నాయుడు మండల కన్వీనర్ గాపూర్, కోకన్వీనర్ కబీర్దాస్, నారాయణరెడ్డి, మెడికల్ షాప్ శేఖర్, మండల పరిధిలోని సర్పంచులు ఎంపీటీసీ మెంబర్స్ మండల నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు