Devanakonda

రైతు హక్కులు సాధించేంత వరకు పోరాటం

రైతు సంఘం జెండా ను ఆవిష్కరించిన జిల్లా సహాయ కార్యదర్శి.ఎం.జగదీష్

దేవరకొండ (పల్లె వెలుగు) 1 సెప్టెంబర్:  నిరంతరం శ్రమిస్తూ ఎటువంటి లాభాలు లేకుండా ఎన్ని నష్టాలు వచ్చిన సరే దైర్యంగా ఎదుర్కొని, అప్పులు ను లెక్క చెయ్యక అర్ధాకలి తో ఉండి దేశానికి ఆహారాన్ని అందిస్తున్న రైతు కనీస అవసరాలు కూడా తీరడం లేదని రైతుకు కనీస సౌకర్యాలు కల్పించడం లో పాలకపక్షాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఈ ప్రభుత్వాలకు వ్యతిరేఖంగా పోరాడి రైతు హక్కులు సాధించే అంతవరకు ప్రతి రైతు పార్టీలకు అతీతంగా పోరాడాలని ఆంద్రప్రదేశ్ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్ పిలుపునిచ్చారు.

రైతు డిమాండ్స్ డే సందర్భంగా స్థానిక సీపీఐ కార్యాలయం ఎదుట రైతుసంఘం జెండా ఆవిష్కరించారు.

రైతుసంఘం మండల అధ్యక్ష,కార్యదర్శులు శివశంకర్, ఇబ్రహీం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎం.జగదీష్ మాట్లాడుతూ దేశంలో అప్పులు బాధలు తో ఎక్కువగా ఆత్మహత్య లు చేసుకుంటున్నారని,వేల కోట్ల రూపాయలు అప్పులు ఎగ్గొట్టే కార్పొరేట్లు ప్రభుత్వాల పై అజమాయిషీ చేస్తుంటే ,వ్యవసాయం కోసం అప్పుచేసి దేశానికి అన్నం పెట్టే రైతు ఆత్మహత్యలు సినిమాల్లో,టీవీ షోల్లో  కన్నీరు కార్చి కోట్ల రూపాయల డబ్బులు సంపాదించేందుకు పనికివస్తుంది తప్ప రైతు కష్టం తీరడం లేదన్నారు. అందుకే రైతు సమస్య లపై పోరాడి మన హక్కులు మనం సాధించే అంతవరకు పోరాడాలని రైతులను కోరారు.కర్నూల్ జిల్లా లో పెండింగులో లో ఉన్న హంద్రీనీవా పిల్లకాలువలు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ప్రతి గ్రామంలో రైతులు చర్చించుకొని ప్రతి రైతు పంట పొలానికి నీళ్లు వచ్చే వరకు పోరాటం కొనసాగిద్దామని కోరారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు మహేష్, రాజు, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button
Enable Notifications    OK No thanks