
Devanakonda
ఘనంగా హెచ్.ఎం. పదవి విరమణ కార్యక్రమం
దేవరకొండ (పల్లె వెలుగు) 31 ఆగష్టు: కుంకునురు గ్రామం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు గజారం వీరేంద్రనాథ్ పటేల్ హెచ్.ఎం గా పనిచేస్తు నేడు పదవీవిరమణ పొందారు. ఈ కార్యక్రమానికి అతిథిగా యం. శ్రీనివాసులు హాజరయ్యారు. గౌరవ అధ్యక్షులుగా ఎల్. ప్రతాప్ కుమార్ వ్యవహరించారు. హెచ్.ఎం. వీరేంద్రనాథ్ పటేల్ సేవలను హాజరైన ప్రతి ఉపాధ్యాయుడు కొనియాడారు. 36ఏళ్ళ సుధీర్ఘకాలం పనిచేసిన కాలం నందు ఎందరినో ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారు. అత్యున్నత ఉద్యోగాలలో చేరేలా ప్రోత్సాహించినందులకు ఋణపడి ఉంటామని తనదగ్గర చదువుకున్న వారు తమభావాలను వ్యక్తం చేశారు. వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు గ్రామప్రజలు పాల్గొన్నారు