Devanakonda

ఘనంగా కప్పట్రాళ్ల దత్తపుత్రుడు ఆకె రవికృష్ణ ఐపియస్ జన్మదిన వేడుకలు

కప్పట్రాళ్ల (పల్లె వెలుగు)30 ఆగష్టు: కప్పట్రాళ్ల గ్రామంలోని కళ్యాణమండపంలో కప్పట్రాళ్ల దత్తపుత్రుడు ఆకె రవికృష్ణ ఐపియస్ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన జన్మదినం సందర్భంగా ఓర్వకల్లు మండలం పొదుపు లక్ష్మి ఐక్య సంఘం మరియు గ్రామ జ్యోతి ప్రాజెక్టు ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలకు ఒక్కొక్క సంఘానికి 45 వేల చొప్పున 71సంఘాలకు గాను మొత్తం 3195000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కప్పట్రాల ప్రజలు మరియు యువత 30 మంది రక్త దానం చేయడం జరిగింది. అదేవిధంగా కంటి వైద్య ఉచిత శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చిన ముఖ్య అతిథులు వి ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు కప్పట్రాళ్ల మల్లికార్జున  మరియు దేవనకొండ ఎస్సై కిరణ్ బాబు ప్రారంభించడం జరిగింది. వి ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు కప్పట్రాళ్ల మల్లికార్జున గారు 500 మందికి అన్నదానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో వి ఆర్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు కప్పట్రాళ్ల మల్లికార్జున గారు మాట్లాడుతూ కప్పట్రాళ్ల గ్రామము గత జిల్లా ఎస్ పి రవి కృష్ణ గారు దత్తత తీసుకోనక ముందు చాలా వెనుకబడి ఉంది.  ప్రస్తుత గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది.సామాజికంగా ఆర్థికంగా మరియు వ్యవసాయ పరంగా మా గ్రామం ఈ రోజు ఇంత బాగా అభివృద్ధి చెందింది అంటే దానికి కారణం అప్పటి జిల్లా ఎస్పి రవికృష్ణ ఐపియస్ ఆని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను. పొదుపు సంఘాలు ఏర్పడి మహిళలు ఆర్థికంగా బలపడుతూ గ్రామాభివృద్ధిలో వారి సహకారం మరువలేనిది. మాగ్రామంలో ఉన్న నిరక్షరాస్యతను తీసివేసి అక్షరాస్యులుగా తీర్చిదిద్దడంలో ఆయనకు ఆయనే సాటి గా ఉన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button
Enable Notifications    OK No thanks