
ఘనంగా పూర్వపు విద్యార్థుల సమ్మేళనం
దేవరకొండ (పల్లె వెలుగు) 29 ఆగష్టు: దేవనకొండ జిల్లా పరిషత్ హైస్కూల్లో హై స్కూల్ హెచ్ఎం మేడం అధ్యక్షతన 1997 మార్చ్ పూర్వపు విద్యార్థుల సమ్మేళనం జరిగినది. ఈ కార్యక్రమానికి హైస్కూల్లో లో విద్యాబుద్ధులు చెప్పినటువంటి గురువులను అందరిని పిలిచి ఊరేగింపుగా ర్యాలీ చేసి ఇ హైస్కూల్ నందు సమావేశం ఏర్పాటు చేసి గురువులను అందరిని సన్మానించి వారికి శాలువాలు, పూల మాల, మెమొంటో లతో గిఫ్ట్ లతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి 1997 బ్యాచ్ లో 108 మంది ఉన్నారు. అందులో ఐదు మంది మరణించడం జరిగింది వారికి సంతాపం ప్రకటించి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి దాదాపు 80 మంది విద్యార్థులు వారి కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. ఇందులో విద్యార్థులు ఒకరికొకరు వారు వారి పేరు వారి ఊరు పేరు వారు చేస్తున్న పని తెలియజేశారు. టీచర్ల గురించి కూడా జ్ఞాపకాలను కొంతమంది గుర్తుచేసి సంతోష పడడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరు కలిసి విజయవంతంగా జయప్రదం చేయడం జరిగింది