
తెర్నేకల్ గ్రామం నందు జాతీయ క్రీడా దినోత్సవం
తెర్నేకల్ (పల్లె వెలుగు) 29 ఆగష్టు: గురువులకు మరియు మిత్రులకు మరియు క్రీడాకారులకు అందరు కూడా శుభ మధ్యాహ్నం ఈ రోజు మన తెర్నేకల్ గ్రామం నందు జాతీయ క్రీడా దినోత్సవం(29-08-2021) SPORTS DAY ను పురస్కరించుకొని అఖండ భారతదేశపు కీర్తి ప్రతిష్టలను, వెలుగెత్తి చాటిన మహనీయుడు ధ్యాన్‌చంద్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని అదేవిధంగానే మన గ్రామంలో కూడా ఆ యొక్క మహానీయుని ఆటను వారసత్వ సంపదగా తీసుకొని ఇప్పటికీ మన గ్రామంలో ఆడుతూ రాష్ట్ర ,జాతీయ స్థాయిలో ఎన్నో పోటీల్లో పాల్గొని ఉన్నత శిఖరాలకు తీసుకుని పోతున్నా క్రీడాకారులను స్మరించుకుంటూ అఖండ భారత దేశపు కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలు వైపులా మూడు సార్లు గోల్డ్‌మెడల్ సధించి భారతదేశం కూడా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో సత్తా చాటుతోంది అనే భావనను ప్రపంచానికి కల్పించిన టువంటి మహనీయుడు హాకీ మాంత్రికుడు భారతదేశపు ముద్దుబిడ్డ భారత దేశపు జాతీయ త్రివర్ణ పథకాన్ని వెలుగెత్తి చాటిన మహనీయుడు. ధ్యాన్ చంద్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని .. ఈరోజు మన గ్రామం నందు ఆ యొక్క మహనీయుని చిత్రపటానికి పూల మాలలు సమర్పించే అభినందనీయమైన సభ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చాలా మంది సీనియర్ క్రీడాకారులు జూనియర్ క్రీడాకారులు వచ్చి ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది.