
అన్నము పెట్టి కడుపు నింపే రైతుకు ఇన్ని కష్టాలా… ?
దేవనకొండ (పల్లె వెలుగు) 29 ఆగష్టు: హర్యానాలో 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరూతూ గత 9 నెలలనుండి పోరాడుతున్న రైతుల, రైతుల నాయకులపై పోలీసులు లాటీలు, తూటాలుతో రక్తం చవిచేస్తున్న కేంద్ర ప్రభుత్వందుర్మార్గ పాలన హళంపట్టి పొలందున్ని హహర్నిశలు కష్టపడి ఆహార ధాన్యాలు పండించి ప్రపంచ ప్రజలకు అన్నము పెట్టి కడుపు నింపే రైతుకు అనేకకష్టాలు,నష్టాలు హక్కులకొరకు ఆరాటం, పోరాటం చేయాలసిన దౌర్భాగ్య పరిస్తితి పాలకులు కల్పిస్తున్నారు హక్కులను హరించి వేస్తూ హక్కులపై ఉక్కుపాదంతో అణిచి వేయాలని బీజేపీ ప్రభుత్వం రైతులపై రక్తం వచ్చేటట్టు పోలీసు బలగాలతో లాఠీలకు, తూటాలకు పనిపెట్టడం దుర్మార్గమైన చర్య అని ఎపి రైతు సంఘం గా కేంద్ర ప్రభుత్వ అహంకారం విధానాన్ని కండిస్తున్నాము. దేవనకొండమండల , రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి లు యం.జగదీష్, మండల కార్యదర్శి ఈ. శివశంకర్, జె.ఇబ్రహీం మాట్లాడుతూరేయనక, పగలనక, పుట్టనక, పామనక, వంకనక వాగణక, వాననక చాలిననక, ఎండనక, రైతు హళంపట్టి పొలం దున్ని బురదనుండి బువ్వతీసి దేశానికి కడుపునిండా అన్నం పెట్టి పస్తులతో జీవనం సాగిస్తున్నాడు ఒకవైపు కరువుతో, మరొక వైపు పలుకుల అసమర్థత పాలనలో రైతు హక్కులపై పోరాటం కొనసిగిస్తుంటే పాలకుల పాపం పండి రైతును, అన్నదాతను, దేశానికి వెన్నెముక, రైతే రాజు జై జవాన్, జై కిసాన్‌ను నడి రోడ్డు లో చంపుతున్నారు అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మండలనాయకులు, జి.మహేష్, బి.నాగరాజు, నల్లన్న, వై.ఆంజనేయులు, వి.నాగరాజు, పి.రహిమాన్ తదితరు పాల్గొన్నారు