ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సచివాలయం ముందు ధర్నా

  • కోనేరు రంగారావు కమిటీ  సిఫారసులను అమలు చేసి భూమిలేని పేదలకు భూములు ఇవ్వాలి
  • రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు పక్కా గృహాలు నాణ్య వంతంగా ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి

దేవరకొండ  (పల్లె వెలుగు) 23 ఆగష్టు: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల నందు పక్కా గృహాలు నాణ్య వంతంగా నిర్మించి ఇవ్వాలని అలాగే కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులను నవరత్నాల్లో చేర్చి భూమిలేని పేదలకు సాగు భూములు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్లు,సీపీఐ మండల ప్రధాన కార్యదర్శి ఎమ్.నరసరావు లు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయూ) రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా దేవనకొండ సచివాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో పక్కా గృహాలు నాణ్యవంతంగా ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే కోనేరు రంగారావు భూకమిటి సిఫారసులను నవరత్నాల్లో చేర్చి, భూమి లేని పేదలకు సాగుభూములు ఇవ్వాలని అన్నారు.అంతే కాక రేషన్ కార్డుల్లో వున్న అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఎటువంటి నిబంధన లు పెట్టకుండా అమలు చేయాలని వారు సూచించారు.అలాగే ఉపాధి హామీ లో కూలీలు పని చేసిన 4 వారా ల వేతనాల బకాయిలు వెంటనే ఇవ్వాలన్నారు.అలాగే వ్యవసాయం లో యంత్రాలను నియంత్రించి, వ్యవసాయ కార్మికుల చే పనులు చేయించుకునేలా చేసి, న్యాయమైన కూలి రేట్లు ఇవ్వాలన్నారు.ప్రజలు వలసలను ఆపేలా ప్రభుత్వం తగు ముందు జాగ్రత్త లు పాటించాలని వారు ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సచివాలయ కార్యదర్శి రఫీక్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి ఎమ్.నెట్టేకల్, వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు రామాంజనేయులు, శ్రీనివాసులు, రవికుమార్, శ్రీను, వీరేష్, మహమ్మద్, మాభాష, రంగన్న, రాజు తదితరులు పాల్గొన్నారు.