Devanakonda

జిల్లాలో హంద్రీనీవా కాలువద్వారా 106 చెరువులు కు నీళ్లు నింపాలి

  • ఎండుతున్న రైతుల పంట పొలాలు ప్రభుత్వానికి, అధికారులు కు  కనిపించడం లేదా
  • ఆంద్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు.పి.రామచ

దేవనకొండ ( పల్లె వెలుగు ) 23 ఆగష్టు:  ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాలు కురవక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్న ప్రభుత్వానికి, అధికారులు కు కనిపించడం లేదా అని రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రామచంద్రయ్య అన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా కర్నూలు జిల్లాలోని 106 చెరువుల కు నీళ్లు నింపాలి అని డిమాండ్ చేస్తూ ఆంద్రప్రదేశ్ రైతుసంఘం ఆధ్వర్యంలో చేపట్టిన చెరువులు సందర్శన కార్యక్రమం ను  దేవనకొండ లో  రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు.పి రామచంద్రయ్య గారు జెండా ఊపి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రామచంద్రయ్య తో పాటు కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి. తిమ్మయ్య, రైతుసంఘం జిల్లా సహాయ  కార్యదర్శులు డి.రాజాసాహెబ్, ఎం.జగదీష్ హాజరు అయ్యారు. ఈ కార్యక్రమం ను జెండా ఊపి ప్రారంభించి న రామచంద్రయ్య  మాట్లాడుతూ ఖరీఫ్ లో సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే  వరద నీటిని వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే హంద్రీనీవా ద్వారా రైతులు పొలాలు కు నీళ్లు ఇవ్వడానికి పాలకులు కు వచ్చిన నష్టం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. రైతు సంక్షేమ ప్రభుత్వాలమని  చెప్పుకొనే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేస్తుంటే దేశంలో కేవలం రైతులు మాత్రమే ఆత్మహత్య లు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మద్దతు ధర లేక రైతులు పండించిన పంటలు పై పెట్టిన పెట్టుబడికి కూడా  రైతు చేతికి రాక  అప్పులు కట్టలేని స్థితిలో ఆత్మహత్య లు చేసుకుంటున్నారు అని అతివృష్టి లేదా అనా వృష్టి వల్ల రైతులు కు వ్యవసాయము భారం గా మారింది అని ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు కు మొదట బలై పోతుంది రైతే అని అన్నారు. జిల్లా లో హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా 106 చెరువుల నింపి రైతులకు పంటపొలాలు నీళ్లు ఇచ్చేవరకు రైతుసంఘం ఆధ్వర్యంలో ప్రతి రైతు పార్టీలు కు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం మండల అధ్యక్ష,కార్యదర్శి లు శివశంకర్, ఇబ్రహీం, మాదన్న, నర్సయ్య, మహేష్,రాజు,విజయ్,తాశాల లాలూ,ఆంజనేయులు, విజయ్,మాభాషా,రహిమాన్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button
Enable Notifications    OK No thanks