Devanakonda

రైతు సంక్షేమం ఎక్కడ

  • కరువులు,రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వాలకు కనపడవా?
  • రైతుసంఘం జిల్లాసహాయ కార్యదర్శి ఎం.జగదీష్

దేవనకొండ (పల్లె వెలుగు) 19 ఆగష్టు:  రైతు సంక్షేమం కేవలం అధికారుల పుస్తకాల్లో,ప్రభుత్వ మాటల్లో మాత్రమే ఉంది తప్పా నిజంగా రైతుకు సంక్షేమం అన్నది లెనేలేదని సీపీఐ రైతు సంగం జిల్లా సహాయ కార్యదర్శి జగదీష్ అన్నారు. రైతుసంఘం ఆధ్వర్యంలో 106 చెరువులు కు నీళ్లు నింపాలి అని డిమాండ్ చేస్తూ రైతుసంఘం ప్రచార కార్యక్రమం మండలం లోని గద్దెరాళ్ల, పల్లెదొడ్డి గ్రామాల్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న సీపీఐ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం.జగదీష్ మాట్లాడుతూ ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం పాటుపడితే దేశంలో వేల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వేల టీఎంసీ ల నీరు సముద్రాల్లో కలుస్తుంటే రైతుల సాగుకు నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి వచ్చిన సమస్య ఏంటి అని ప్రశ్నించారు. హంద్రీనీవా ప్రధాన కాలువ కు అనుబంధం గా ఉన్న పిల్లకాలువలు పూర్తి చేసి దేవనకొండ మండలం లో ప్రతి గ్రామానికి,చెరువులకు నీళ్లు ఇవ్వడంద్వారా ప్రతి రైతు భూమికి నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శిలు ఇబ్రహీం,శివశంకర్ మాట్లాడుతూ ఆగష్టు 21 నుండి 23 వ తేదీ వరకు రైతుసంఘం ఆధ్వర్యంలో జిల్లా లోని 106 చెరువులు ను సందర్శించడం జరుగుతుందిఅని ప్రతి గ్రామ రైతు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రైతుసంఘం నాయకులు ఆంజనేయులు,పురుషోత్తం,అనిల్ నాగరాజు పల్లెదొడ్డి, గద్దెరాళ్లగ్రామ రైతులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button