
adoni
ఉరి వేసికొని వ్యక్తీ మృతి
ఉరి వేసికొని వ్యక్తీ మృతి
ఆదోని (ఆంధ్రప్రతిభ) 19 మే: కర్నూలు జిల్లా ఆదోని ఎస్.కేడి కాలనీలో నివాసముంటున్న వెంకటసుబ్బయ్య (అలియాస్ బాబు) 48 సంవత్సరాలు వయసు గల వ్యక్తి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం నుంచి ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో స్థానికులు అనుమానం వచ్చి తలపులు తీయగా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించి ఆదోని టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. మృతుడికి ఒక కూతురు ఒక బాబు ఉన్నారు. ప్రస్తుతం భార్య హెడ్ నర్స్ గా ఆదోని లో విధులు నిర్వహిస్తూ బదిలీపై ఈ మధ్యకాలంలో గుంతకల్ లో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఆత్మహత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది