adoni

ఘనంగా ఏసీ యు సి ఏ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

ఘనంగా ఏసీ యు సి ఏ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు

ఆదోని(పల్లె వెలుగు)  02 డిసెంబర్: ఈ 25వ తేదీ జరుగు ఏసు క్రీస్తు జన్మదినం పురస్కరించుకొని డిసెంబర్ నెలలో ముందుగా సెమి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అందులో భాగంగా ఏసీయు సిఎ సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాత్రి  ఆదోని పట్టణం లోని సిఎస్ ఐ  హోలి ట్రినిటీ చర్చ్ ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఏసీయుసిఎ అధ్యక్ష కార్యదర్శులు జోసఫ్ జాషువా ఏజ్రా శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగీకులు బ్రదర్ ఇమ్మానియేల్ వాక్య పరిచయం చేశారు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు  పట్టణంలోని అన్ని క్రైస్తవ సంఘాల పాస్టర్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏసీ యు సి ఎ సంఘం అధ్యక్ష కార్యదర్శులు జోసఫ్ జాషువా, ఏజ్రా శ్రీధర్ లు మాట్లాడుతూ క్రైస్తవులకు పవిత్రమైన పండుగ  యేసుక్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ అని అన్నారు పాపుల రక్షణ కోసం కన్య మరియమ్మ గర్భం నుండి మనిషిగా జన్మించి సిలువపై మరణించారు అని అన్నారు అలాంటి లోక రక్షకు డి జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తేదీన ప్రతి క్రైస్తవ కుటుంబం అంగరంగ వైభవంగా ఈ పండుగను జరుపుకుంటారని అందుకోసమే డిసెంబర్ నెలలో ముందస్తుగా సెమి క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోవడం నాటినుండి ఇ ఆనవాయితీగా వస్తుందని అందులో భాగంగా ఏసీ యు సి ఎ సంఘం ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సెమీ క్రిస్మస్ వేడుకలకు వేలాది మంది క్రైస్తవ బిడ్డలు పాల్గొని జయప్రదం చేయడం హర్షణీయమన్నారు ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసముతో జీవిస్తే పరలోకములో ఏసుక్రీస్తు చెంతన ఉంటామని గ్రహించి జీవించాలని అన్నారు ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో యేసు క్రీస్తు ప్రార్థన మందిరం లో ని సంఘం సభ్యురాలు షారోన్ రోజా పాడిన గీతం పట్లఅక్కడ చేరి వచ్చిన క్రైస్తవ సోదరి, సోదరులను ఆకట్టుకోవడం విశేషం ఈ కార్యక్రమంలో ఏసీ యు సి ఎ సంఘం కోశాధికారి ఆశీర్వాదం, తో పాటు  సంఘం సభ్యులు క్రైస్తవ కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.

Back to top button