adoniNagaraju

ప్రమాణ స్వీకార మహోత్సవం

ఆదోని(పల్లె వెలుగు) ఆదోని మండలం మండల పరిషత్ కర్యాలయంలో మండల పరిషత్ ప్రాదేశిక నియెజక వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా రిటర్నింగ్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 23 మంది సభ్యులు ఎంపిటిసిలు మరియు కో- అప్టెడ్ సభ్యునీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగినది. ఆదోని మండలం మండల అధ్యక్షులుగా బడాయి దానమ్మ, వైస్ ఎంపీపీ నరేంద్ర కుమార్ రెడ్డి ఎన్నికయ్యారు. కో ఆప్షన్ మెంబర్ నకరతి వాదిరాజు ఏకగ్రీవంగ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఆదోని శాసనసభ్యుల వై. సాయి ప్రసాద్ రెడ్డి, ఎంపీడీవో గీత వాణి తదితరులు పాల్గొన్నారు.

జాలిమంచి, దొడ్డనకెరి MPTC గా సరోజమ్మ

ఆదోని మండలం జాలిమంచి, దొడ్డనకెరి గ్రామ MPTC గా సరోజమ్మ1372 ఓట్ల తో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆమె గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు. గ్రామ వైసిపి నాయకులు రంగారెడ్డి, మల్లప్ప, లాజర్ పూలమాల తో సత్కరించారు.

Back to top button