adoniNagaraju

పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా టి.డి.పి ధర్నా      

ఆదోని (పల్లె వెలుగు)28 ఆగష్టు: ఆదోని నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు గారి ఆదేశాలమేరకు,కర్నూలు పార్లమెంటరీ ప్రధాన  కార్యదర్శి K. భూపాల్ చౌదరి  ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలకు వెతిరేకంగా పాతబస్టాండ్ కూడలి దగ్గర ధర్నా ,రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా భూపాల్ చౌదరి మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డీజిల్ ధరలు పెంచుతూ సామాన్య ప్రజలపై భారం మోపడం సరి కాదని ఆయన ఆరోపించారు. గత రెండేళ్లుగా కరోన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ మొండి వైఖరి విడచి పెరిగిన ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కేట్ యార్డు చైర్మన్ దేవేంద్రప్ప,రామస్వామి, శ్రీరాములు,సజ్జాద్,గోపాల్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks