
ఆదోని(పల్లె వెలుగు) 25 ఆగష్టు: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో కర్నూల్ కలెక్టర్ ఆఫీస్ ముందు గురువారం వెల్దుర్తికి చెందిన మాస పోగు విజయ రాఘవ కు మద్దతుగా ధర్నా నిర్వహిస్తున్నామని ఎమ్మార్పీఎస్ ఆదోని టౌన్ అధ్యక్షుడు జగన్ తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకూ ఎమ్మార్పీఎస్ అండగా ఉంటుందని అన్నారు. కావున ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవలసిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న కుమారు, ఆనంద్ ,రామంజి ,విజయ్, చిట్టిబాబు, అనిల్, అజయ్, రాజు ,నరసింహ పాల్గొన్నారు.