
ఆదోని(పల్లె వెలుగు) 22 ఆగష్టు: ఆదోని మండలం దోడనకెరీ గ్రామంలో వెలిసిన శ్రీ చింతల మునిస్వామి 43వ ఆరాధన మరియు రథోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా జరిగాయి. భక్తులు కోరికలు తీర్చే కలియుగ దైవం శ్రీ సద్గురు చింతల ముని స్వామి 43వ ఆరాధన సందర్భంగా గాలి గోపురం మరియు కొత్త రథంము తయారు చియించారు . భక్తాదులు మరియు గ్రామస్తులు గాలి గోపురము మరియ కళశ ప్రతిష్టాపన చేశారు. మూడు రోజులు కనులు పండగ అంగరంగ వైభవంగా జరిగింది. సాధువుకు సత్పురుషులకు వచ్చిన భక్తులకు గ్రామస్తులకు ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సాధువులకు సత్పురుషులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది .ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద తుంబలం ఎస్ఐ చంద్ర మరియు సిభంది కి అర్చకుడు పూజారి భక్తుడు అన్ని కార్యక్రమంలో చూసుకుంటూ ఎనలేని కీర్తి పూజారి రమేష్ పోలీసులకు సన్మానించడం జరిగింది. వచ్చే సంవత్సరం నాటికి మరో 3 గాలిగోపురం కట్టాలని ప్రయత్నిస్తున్నామని అందుకు భక్తాదులు నాయకులు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు తమ వంతు సహాయంగా తమకు తోచిన సహాయం చేయాలని పూజారి రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు భక్తాదులు ఊరి ఆడపడుచులు తదితరులు పాల్గొన్నారు.