adoniNagaraju

చింతల ముని రథోత్సవంలో విషాదం.

ఆదోని(పల్లె వెలుగు) 18 ఆగష్టు:  కర్నూలు జిల్లా ఆదోని మండలం పరిధిలోని పెసల బండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఈరోజు పెసల బండ  గ్రామంలో చింతల ముని స్వామి రథోత్సవం జరుగుతుండగా, గ్రామంలో పండగ వాతావరణంతో ప్రజలందరూ సంబరాలు జరుగుతుండగా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఉదయం 9 గంటల 30 నిమిషాలకు చింతల ముని స్వామి రథోత్సవం కార్యక్రమం జరుగుతుండగా  ప్రమాదవశాత్తు రథోత్సవం పైన ఉన్న కలశం విద్యుత్ తీగలు తగలడంతో ఈ ఘటన చోటు  చోటుచేసుకుంది. దీంతో ఒక్కసారిగా అరుపులు కేకలతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి, ఒక్కసారిగా ఏర్పడింది. క్షణాల్లో ఆర్తనాదాతో గ్రామం లో విషాదఛాయలు కమ్ముకున్నాయి. ఈ ఘటనలో విద్యుత్ షాక్ తో శెట్టీ బలిజ వెంకటేష్, పదవ తరగతి విద్యార్థి వీరాంజనేయులు  ఇద్దరు మృత్యువాత పడ్డారు, మరో ముగ్గురు, గోపాల్, ఆంజనేయులు ,సాయితేజ కు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటనలో వెంకటేశులు భార్య పద్మావతి ఇద్దరు పిల్లలు ఉన్నారు.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆదోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.బాధితులను పరామర్శించడానికి ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి, ఆర్ డి ఓ రామకృష్ణారెడ్డి, ఎస్ఐ విజయలక్ష్మి జయ మనోజ్ రెడ్డి, బాధితులను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు.ఈ ఘటన అధికారుల నిర్లక్ష్యం, ఆలయ కమిటీ నిర్లక్ష్య వైఖరి వల్లే ఇద్దరు ప్రాణాలు బలయ్యారని, బాధితులను ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని అలాగే ఈ ఘటనపై ఎంక్వయిరీ వేయాలని గ్రామ ప్రజలు వాపోతున్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks