
ఆదోని (పల్లె వెలుగు) 16 ఆగష్టు: ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన నరసింహులు, మల్లేష్ కుటుంబ సభ్యులు ఆర్డీవో కార్యాలయం ముందు సోమవారం ఆందోళన చేశారు. పెద్ద కడుబూరు మండలం చిన్న తుంబలం గ్రామ రెవిన్యూ లో తమ పొలం కు చెందిన 60 సెంట్లు భూమిని డబ్బులు తీసుకుని అక్రమంగా వేరే వ్యక్తి పై ఆన్లైన్ చేశారని దీనికి కారణమైన విఆర్వో తిప్పన పై చర్యలు తీసుకోవాలని ఆర్ డి ఓ రామకృష్ణారెడ్డికి స్పందన కార్యక్రమంలో విన్నవిచుకున్నారు. VRO తిప్పన్న ను అడిగినందుకు మా అన్న సూర్య నారాయణ పై పెద్దకడుబూరి పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసు పెట్టారన్నారు. విచారించి న్యాయం చేయాలని కోరారు.