
ఆదోని (పల్లె వెలుగు) 14 ఆగష్టు: పట్టణంలో HK మొబైల్ సెంటర్ లోగత వారం 35 సెల్ ఫోన్ లను చోరీ చేసిన దొంగలను ఆదోని 2వ పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. సి.ఐ శ్రీరాములు మాట్లాడుతూ రాజస్థాన్ కు చెందిన దళపతి సింగ్,రతన్ సింగ్ లను ఈ రోజు రైల్వే స్టేషన్ సమీపంలో అరెస్టు వారి వద్ద 35 సెల్ ఫోన్ లను రికవరీ చేయడం జరిగిందని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా ఖచ్చితంగా పట్టుకుంటామని అన్నారు.