Aaluru

ఘనంగా కోట్ల సుజాతమ్మ జన్మదిన వేడుకలు

ఘనంగా కోట్ల సుజాతమ్మ జన్మదిన వేడుకలు

ఆలూరు (పల్లెవెలుగు) 04 ఏప్రిల్: తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోట్ల సుజాతమ్మ జన్మదినం సందర్భంగా ఆస్పరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. స్నేహశీలి, మృదుస్వభావి, పనిలో అంకితభావం, నముకున్నవారికి కొండంత అండగా నిలిచే తత్వం, ప్రత్యర్థుల పాలిట సింహ స్వప్నం, మాజీ ముఖ్యమంత్రి కోడలు, మాజీ ఎమ్మెల్యే, ఆలూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి కోట్ల సుజాతమ్మ కి జన్మదినం శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల నాయకులు, కార్యకర్తలు, కోట్ల యూత్ నాయకులు, నందమూరి బాలకృష్ణ అభిమానులు, తెలుగు యువత నాయకులు తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button