
Aaluru
మంత్రి సమక్షంలో టీడీపీ నుండి వైసీపీ లోకి భారి చేరికలు
మంత్రి సమక్షంలో టీడీపీ నుండి వైసీపీ లోకి భారి చేరికలు
ఆలూరు (పల్లె వెలుగు) ఆలూరు లో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం సమక్షంలో టీడీపీ నుండి వైసీపీ లోకి మాజీ జడ్పీటీసీ రాంభీమ్ నాయుడు,మాజీ ఎంపీపీ చౌడరెడ్డి తో పాటు 500 మంది కార్యకర్తలు చేరడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు వల్ల ఆకర్షితులై వైసీపీ లోకి చేరడం జరుగుతుంది. రాష్ట్రంలో బీసీలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నారు.అనేక మంది బీసీలకు ,ఎస్సీ లకు,మైనార్టీల కు అనేక పదవులు కట్టపెట్టడం జరిగింది. కర్నూలు జిల్లా లో కోట్ల కుటుంబం కులాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాలు చేస్తున్నారు.కోట్ల కుటుంబం ఫ్యాక్షన్ రాజకీయాలు తో ఏందోరో మహిళలను వితంతువులు అయ్యారు.అమ్మఒడి ద్వారా పేద విద్యార్థులు విద్యకు దగ్గర అవుతున్నారు.