Aaluru

ఆలూరు నియోజకవర్గంలో టిడిపి పార్టీకి సంబంధించిన మదాసి కురువలను గుర్తించకపోవడం పై అధిష్టానం వెంటనే స్పందించాలి

ఆలూరు (పల్లె వెలుగు) 07 అక్టోబర్: ఆలూరు నియోజకవర్గం లో మదాసి& మదరి కురువ  (కురువ) రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ నాయకుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని మండలాల టిడిపి కురువ ప్రజాప్రతినిధులు పాల్గొనడం జరిగింది వారు ఆలూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్లను నియమించింది మన సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఒక్క మండలానికి కూడా మన కురువ సామాజిక వర్గానికి మండల కన్వీనర్ పదవిని కట్టబెట్టి లేదని ఈ విషయంపై ఆలూరు టిడిపి కురువ సామాజిక వర్గం వారు తీవ్రమైన నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మదాసి కురువ వ్యవస్థాపక అధ్యక్షులు N మోహన్ ప్రసాద్  మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గం లో మా సామాజికవర్గం దాదాపు 59 వేల ఓట్ల జనాభా ఊన్నారు మమ్మల్ని గుర్తించి మండల కన్వీనర్ గా ఎంపిక చేయాలని టిడిపి తాలూకా ఇన్చార్జ్ గారిని మరియు జిల్లా అధ్యక్షులను టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాం అని తెలియ చేయడం జరిగింది అలాగే మదాసి కురువ మదారి కురువ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామ మోహన్ మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గనికి సంబంధించిన మండలాలలో మా కుల సామాజిక వర్గం అత్యధిక జనాభా హోళగుంద, హాలహర్వి, ఆలూరు, ఆస్పరి, మిగతా రెండు మండలాలలో పరిమితంగా మా సామాజిక వర్గం ఉంది  ఆలూరు నియోజకవర్గం లో మా సామాజిక వర్గానికి కచ్చితంగా రెండు మండల కన్వీనర్ల పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము కొంతమందికి మేము ప్రశ్నించినందుకు ఒక పార్టీకి తొత్తులుగా ఉన్నారని చౌకబారు విమర్శలు చేయడం జరిగింది అలాంటి వారికి మేము తెలియజేసేది ఏమనగా మేము ఏ పార్టీకైనా తొత్తులుగా వ్యవహరిస్తూ ఉంటే లేక ఏ పార్టీ కార్యక్రమంలో పాల్గొనీ ఉంటే.. బహిరంగ పరచండి అప్పుడు నేను మీ ముందు తల వంచుతా అనవసరమైన అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి మీ యొక్క గౌరవాన్ని కించపరచు కోవద్దండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మా యొక్క ఆవేదనను అర్థం చేసుకుని ఆలూరు తాలుక టిడిపి ఇన్చార్జి స్పందించాలని కోరుతున్నాము లేని పక్షంలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్ధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రాబోవు రోజుల్లో మా పాత్ర ఏమిటో చూపిస్తాం..అని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మదాసి కురువ నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

madhavaiah

Madhavaiah, Reporter, Pattikonda, \urnool Dist
Back to top button